AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్

T20 World Cup 2026, India vs Pakistan Match: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడటానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ బోర్డు మ్యాచ్ ఆడటానికి ఒక షరతు పెట్టిందని పాకిస్తాన్ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

India vs Pakistan: భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Feb 03, 2026 | 7:36 AM

Share

Pakistan Cricket Team: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులు ముగిసే సూచనలు కనిపించడం లేదు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడటానికి పాకిస్తాన్ మొదట నిరాకరించిన సంతగి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం షరతులు విధించిందని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌ను తిరిగి చేర్చుకుంటేనే పాకిస్తాన్ జట్టు భారత్‌తో ఆడుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. కానీ పీసీబీ ఆ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది.

ఐసీసీ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ..

బంగ్లాదేశ్ జట్టు తన అన్ని మ్యాచ్‌లను భారతదేశం నుంచి శ్రీలంకకు మార్చాలని అకస్మాత్తుగా డిమాండ్ చేయడంతో ఐసీసీ ఆ జట్టును టీ20 ప్రపంచ కప్ నుంచి మినహాయించింది. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించినందున బీసీబీ ఈ ఆకస్మిక డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ అంగీకరించలేదు. ఈ అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, బీసీబీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినప్పటికీ, బీసీబీ తన డిమాండ్‌పై దృఢంగా ఉండిపోయింది. చివరికి ఐసీసీ దాన్ని మినహాయించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది.

పాకిస్తాన్ రాజకీయాలు..

బంగ్లాదేశ్ జట్టు ఓటమి తర్వాత, పాకిస్తాన్ ఈ అంశాన్ని రాజకీయం చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని పీసీబీ తన ప్రభుత్వంతో చర్చించి, చివరికి పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని, కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. పాకిస్తాన్ చర్య తర్వాత, ఐసీసీ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాకిస్తాన్‌కు ఈ విషయం తెలుసు. పీసీబీ త్వరలో ఈ అంశంపై యూ-టర్న్ తీసుకోవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై