AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సద్దుల బతుకమ్మ ఎప్పుడూ..? అయోమయంలో సంబరాలు..! పండితుల భిన్న ప్రచారాలు..

ఈసారి సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆడ పడుచుల్లో అయోమయాన్ని మిగిల్చాయి.. సద్దుల బతుకమ్మ ఎప్పుడూ..! బతుకమ్మ ఉత్సవాలకు శాస్త్రం వర్తిస్తుందా..! తొమ్మిది రోజులే ప్రామాణికంగా పరిగణించాలా..? వేద పండితులు ఏమంటున్నారు.! ఆడ పడుచుల అయోమయానికి పండితుల భిన్న ప్రచారాలే కారణమయ్యాయి.. మరి సద్దుల బతుకమ్మ ఎప్పుడూ..! తెలంగాణ విద్వత్ సభ ఏం తేల్చింది..! ప్రభుత్వం అధికారిక ప్రకటనలో ఏముంది..! తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

సద్దుల బతుకమ్మ ఎప్పుడూ..? అయోమయంలో సంబరాలు..! పండితుల భిన్న ప్రచారాలు..
Bathukkama
G Peddeesh Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 28, 2025 | 12:48 PM

Share

సద్దుల బతుకమ్మ సంబరాలకు సన్నద్ధమవుతున్న మహిళలు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు..సద్దుల బతుకమ్మను ఏరోజు గంగమ్మ ఒడికి సాగనంపాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. దీనికి తోడు వేద పండితుల భిన్న ప్రచారాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు వేద పండితులు బతుకమ్మ ఉత్సవాలకు శాస్త్రం, తిథులు వర్తించవు అంటుంటే.. మరికొందరు పండితులు మాత్రం కచ్చితంగా శాస్త్రం శాస్త్రీయత పాటించాల్సిందే అంటున్నారు.. పండితుల భిన్న అభిప్రాయాలు, వాదనలు ఇప్పుడు తెలంగాణ మహిళలోకాన్ని అయోమయంలోకి నెట్టేసాయి..

ఈనెల 21వ తేదీన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలతో ఈ ఏడాది బతుకమ్మ సంబరాల ఆరంభమయ్యాయి.. వరుస క్రమంలో 21వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మ, 22వ తేదీన అటుకుల బతుకమ్మ, 23వ తేదీన ముద్ద పప్పు బతుకమ్మ, 24వ తేదీన నానబియ్యం బతుకమ్మ, 25వ తేదీన అట్ల బతుకమ్మ, 26వ తేదీన అలిగిన బతుకమ్మ, 27వ తేదీన వేప కాయల బతుకమ్మ, 28వ తేదీ అంటే 8వ వెన్న ముద్దల, 29వ తేదీ చివరిరోజు అంటే 9వ రోజున సద్దుల బతుకమ్మ సంబరాలు జరపాల్సి ఉంటుంది.. కానీ ఒక తిధి రెండు రోజులు వస్తున్న కారణంగా సద్దుల బతుకమ్మ సంబరాలు 30వ తేదీన నిర్వహించాలని విద్యుత్ సభ నిర్వహించింది.. ఆ మేరకే కొందరు పండితులు 30వ తేదీన మంగళవారం సద్దుల బతుకమ్మ సంబరాలు జరపాలని ప్రకటించారు..

అయితే బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజులు నిర్వహించడం ఆనవాయితీ.. ఎలాంటి తిధులు _ వర్జాలు, ముహూర్తాలు బతుకమ్మ ఉత్సవాలకు వర్తించవని మరికొందరు పండితులు చెబుతున్నారు.. శాస్త్రం శాస్త్రీయత బతుకమ్మ ఉత్సవాలకు పులమవద్దని 9 రోజులే ప్రామాణికంగా భావించి 29వ తేదీనే సద్దుల బతుకమ్మ ఉత్సవాల నిర్వహించాలని మరికొందరు పండితులు చెప్తున్నారు…

ఇవి కూడా చదవండి

వేద పండితుల భిన్న ప్రచారాలు మహిళలను అయోమయంలోకి నెట్టేసాయి.. సద్దుల బతుకమ్మ సంబరాలు ఏ రోజు జరుపుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు..సద్దుల బతుకమ్మ సంబరాలు ఏ రోజు ఏర్పాటు చేయాలో అర్థంకాక తరలిపట్టుకుంటున్నారు.. కొన్ని ప్రాంతాలు 29వ సద్దుల బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పండితుల సూచన మేరకు 30వ తేదీన మంగళవారం సంబరాలు జరపడానికి సిద్ధమవుతున్నారు..

వీడియో ఇక్కడ చూడండి..

భిన్న ప్రచారాలు భిన్న వాదన నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.. 30వ తేదిన సద్దుల బతుకమ్మ సంబరాలకు తేదీ ఫిక్స్ చేసింది ప్రభుత్వం.. దీంతో వివాదానికి స్థిరపడినట్లఇంది.. రాష్ట్రవ్యాప్తంగా 30వ తేదీన సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాల్సి ఉంటుంది..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..