నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన వారిని అరెస్టులు చేసినా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినా వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకుండా.. […]

నోటీసులు ఇవ్వకుండా.. సస్పెండ్ చేయడం పై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 8:35 AM

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన వారిని అరెస్టులు చేసినా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినా వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకుండా.. ఉద్యోగం నుంచి తమను తొలగించడం కరెక్టు కదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ రూపొందించిన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇలా అయితే భవిష్యత్తులో ఆర్టీసీని ఎలా నడపాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఆర్టీసీలో ప్రైవేటు బస్సులు వస్తాయంటూనే, మొత్తం ఆర్టీసీని మాత్రం ఎప్పటికీ ప్రైవేటీకరించబోమని సీఎం ప్రకటించారు.

ఆర్టీసీ సంస్థ ఎప్పటికీ ఉండి తీరాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఆర్టీసీని పటిష్టపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామనీ సీఎం కేసీఆర్ చెప్పారు. సునీల్ శర్మ ప్రతిపాదనలపై చర్చించిన తరువాత సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మొత్తానికి యూనియన్ల ప్రవర్తన వల్లే ఇలా చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే నోటీసులు కూడా ఇవ్వకుండా తమను ఎందుకు డిస్మిస్ చేశారని.. సస్పెండ్ అయిన కార్మికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం యూనియన్ల ప్రవర్తన వల్లే ఇదంతా జరుగుతోందని చెబుతోంది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ఇలా చేస్తున్నామని అంటోంది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి ప్రజలు మెచ్చుకుంటున్నారని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్