AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ హీస్ట్ తరహాలో దిమ్మదిరిగేలాంటి స్కెచ్.. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి.. కానీ.!

ఔను.. ఇక్కడ సెక్యూరిటీ గార్డు లేడు. ఔను.. సీసీ కెమెరాల హార్డ్ డిస్కూ లేదు. ఔను.. దొంగలు పడ్డారు, దోపిడీ జరిగింది. ఔను.. 19 కిలోల బంగారం పోయింది. ఔను.. దర్యాప్తు చేస్తున్నాం.. పట్టుకుంటాం. ఇదీ వరస. సినిమాల్లో క్లయిమాక్స్‌లో కనిపించే పోలీసుల్లాగే వరంగల్‌ పోలీసులూ ఈ పాటే పాడుతున్నారు.

మనీ హీస్ట్ తరహాలో దిమ్మదిరిగేలాంటి స్కెచ్.. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి.. కానీ.!
Robbery In Rayaparthy SBI Bank
Ravi Kiran
|

Updated on: Nov 21, 2024 | 8:00 AM

Share

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం.. ఎస్‌బీఐ బ్రాంచ్.. మంగళవారం సాయంత్రం డ్యూటీ కాగానే తాళాలేసుకుని వెళ్లారు సిబ్బంది. బుధవారం పొద్దున్నే వచ్చి చూసేసరికి లాకర్లలో ఉండాల్సిన బంగారమంతా గాయబ్..! 13 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఎక్కడ..? ఇది లూటీ కాదు.. మహా లూటీ..!

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

ఇంట్లో ఉండే ఇనబ్బీరువాల మీద నమ్మకాల్లేక కొందరు.. అవసరాలకు పైసలిస్తారని తనఖా పెట్టి కొందరు బ్యాంకు బీరువాల్ని నమ్ముకుంటే.. చివరికి మిగిలింది.. బూడిదేనా? బ్యాంకులో 630 మంది ఖాతాదారులు బంగారం పెడితే.. అందులో 138 మంది బంగారం మాత్రమే భద్రంగా ఉంది.. మిగతా 497 మందికి చెందిన పంతొమ్మిదిన్నర కేజీల బంగారం దొంగలపాలైందట. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి.. మరి లోపలుండాల్సిన బంగారమెక్కడ..? అసలీ దోపిడీ ఎలా జరిగింది..?

ఇవి కూడా చదవండి

ఆక్సిజన్ సిలిండర్లు వెంట తెచ్చుకొని.. బ్యాంకు వెనకవైపు కిటికీలు పగలగొట్టి.. లోపలికి దూరి.. గ్యాస్ కట్టర్ల సాయంతో లాకర్లు బ్రేక్ చేసి.. లూటీకి పాల్పడ్డారంటే..! మనీ హీస్ట్‌ సిరీస్‌ని తలదన్నే రీతిలో ఉంది కదా ఈ దోపిడీ స్కెచ్చు? ఇది ఖచ్చితంగా పక్కా ప్రొఫెషనల్‌ దొంగల పనే. అందుకే.. వెంటనే ఎటెన్షన్‌లోకొచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్. నాలుగు ప్రత్యేక టీములుగా విడిపోయి లూఠీ ఘటనపై విచారణ స్పీడప్ చేశారు. చోరీ సమయంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను కూడా దొంగలు మాయం చేశారు. దీంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

ఇది ఖచ్చితంగా సాదాసీదా దొంగల పని కాదు.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా చేతివాటమేనన్న క్లారిటీ ఐతే ఉంది. సేమ్‌టు సేమ్ ఇదే తరహాలో మూడు వారాల కిందట కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో కూడా బ్యాంకు లూటీ జరిగింది. అక్కడ దోపిడీకి గురైంది కూడా ఎస్‌బీఐ బ్రాంచే.. అక్కడ వాడింది కూడా గ్యాస్ కట్టర్లే. అక్కడ పోయింది కూడా కిలోలకొద్దీ బంగారమే. ఇప్పుడు వరంగల్ ఎస్‌బీఐకి కన్నం వేసింది కూడా ఆ ఘరానాగాళ్లేనా.. లేక వేరే ఎవరైనా దోపిడీకి తెగించారా..? దోపిడీ వార్తలు విని గుండెలు బాదుకుంటూ పోలోమని బ్యాంకు దగ్గరకు పరుగులు పెడుతున్నారు బాధితులు.

మా బంగారం ఉందా పోయిందా.. చెప్పండి సారూ.. అని దీనంగా వేడుకుంటున్నారు. రాయపర్తి ఎస్‌బీఐ లూటీ వార్త వినగానే.. వరంగల్‌లోనే కాదు.. మిగతా చోట్ల కూడా బ్యాంకుల భద్రత మీద డౌట్లొచ్చేశాయి జనాలకు. కర్నాటక నుంచి దోపిడీదొంగల ముఠా తెలంగాణలో మకాం పెట్టిందా.. పోలీసులు తేల్చేదాకా నిద్రపట్టదు ఇక్కడి జనాలకు.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..