AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హృదయవిదారక ఘటన.. కాపాడమని వేడుకున్నా కనికరించని జనం!

రోడ్డు ప్రమాదంలో.. తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరుగుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ అతను వేడుకుంటున్నాడు. చుట్టూ జనాలు మూగినా ఒక్కరు కనికరించలేదు. 108 వచ్చేవరకు ఫోటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూశారు.

Hyderabad: హృదయవిదారక ఘటన.. కాపాడమని వేడుకున్నా కనికరించని జనం!
V Yelendra
Ram Naramaneni
|

Updated on: Nov 21, 2024 | 10:00 AM

Share

ఇటీవల సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి రీల్స్‌, వీడియోలు పిచ్చి ఎంతగా పెరిగిపోయిందంటే… సాటి మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఫోటోలు వీడియోలు తీస్తూ వాటిని వ్యూస్‌, లైక్స్‌ కోసం నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో బుధవారం జరిగింది. రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలతో రక్తమోడుతుంటే సాయం చేయమని ప్రాధేయపడినా జనాలు పట్టించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీసుకోవడంలో మునిగిపోయారు. ఇంతలో అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన వి. ఏలేందర్ కీసర రాంపల్లి చౌరస్తాలో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రోడ్డపై పడిపోయిన ఏలేందర్ తనను కాపాడాలంటూ అటుగా వెళ్తున్న వారిని చూసి కేకలు వేసి అర్థించారు. గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఏలేందర్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో విలవిల్లాడిపోయిన ఏలేందర్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్నారు. ఆయన కన్నీళ్లు అక్కడున్న వారిని కదిలించలేకపోయాయి. 108కు సమాచారం అందించి అతడిని ఫొటోలు, వీడియోలు తీస్తూ గడిపేశారు. ఆ తర్వాత 108 వాహనం వచ్చి బాధితుడిని ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.. 

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..