Razakar Movie: తెలంగాణ ఎన్నికల ముందు.. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ‘రజాకార్’ సినిమా పోస్టర్..

| Edited By: Shaik Madar Saheb

Jul 18, 2023 | 1:42 PM

Razakar Movie: టాలీవుడ్‌లో మరో సినిమా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. రజాకార్ సినిమా పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Razakar Movie: తెలంగాణ ఎన్నికల ముందు.. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ‘రజాకార్’ సినిమా పోస్టర్..
Razakar Movie
Follow us on

Razakar Movie: టాలీవుడ్‌లో మరో సినిమా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. రజాకార్ సినిమా పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను టార్గెట్‌ చేసే ఈ సినిమా తీశారని ముస్లిం మత పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో రజాకార్ సినిమా పోస్టర్‌పై వివాదం.. మతంతోపాటు.. రాజకీయ టర్న్ తీసుకునే అవకాశముందని ఓ వర్గం ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ‘రజాకార్ -ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, తదితరులు ఆవిష్కరించారు. హైదరాబాద్​సంస్థానంలోని రజాకార్ల దురాగతాల గురించి బయటకు తెలియని పలు విషయాలను ఈ సినిమా కథలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అందరికీ వాస్తవాలు ముందుంచాలనే లక్ష్యంతో రజాకార్ సినిమా తీసినందుకు అభినందించారు బండి సంజయ్. నిజాం-రజాకార్ల పాలనను స్వర్ణ కాలంగా పేర్కొంటున్నారని మండిపడ్డారు.

అయితే, రజాకార్ సినిమాపై ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగా నరహంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 1948 నాటి ఘటనలను తప్పుగా చిత్రీకరించి బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాల్లో ముస్లిం సమాజాన్ని ఓ బూచిగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించారనే విమర్శులు వెల్లువెత్తాయి. ఇప్పుడు తెలంగాణలో రజాకార్లపై తీసిన సినిమాలోనూ అట్లాంటి మరో ప్రయత్నమే చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1948 సమయంలో నిజాం ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత పోలీస్ యాక్షన్ లాంటి పరిస్థితిని చిత్రకరిస్తూ.. ముస్లింలే పెద్ద నేరస్తులుగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Razakar

తుపాకీ కత్తిపై ఓ బ్రాహ్మణుడు మృతదేహం వేలాడుతున్నట్టు చూపించడం కూడా పెద్ద వివాదానికి దారి తీస్తుంది. ఆనాడు రజాకార్లు ఒక కులం అంటూ టార్గెట్ చేయలేదని.. ఎక్కువగా రెడ్లు, దళితులే బలయ్యారని ఎలక్షన్ల కోసం, వేడిలో వేడిగా డబ్బు చేసుకోవడం కోసం ఈ పాట్లు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు అటు మత పెద్దలు ఇటు ఎంబీటీ లాంటి రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాను తీస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరంటూ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

Razakars (Hyderabad): హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ ఆర్మీ.. రజకార్లు..

హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. రజాకార్లు అంటే స్వచ్ఛంద సేవకులు అని అర్థం.. రజాకార్లు నిజాం రాజుతోపాటు.. ముస్లీం లీగ్, బ్రిటీష్-ఆక్రమిత దళాధిపతులకు సహచరులుగా ఉండేవారు. బహదూర్ యార్ జంగ్ మరణించిన తరువాత రజకార్ నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి నుంచి దాని స్వరూపమే మారిపోయింది. ప్రజలపై దాడులు చేయడంతోపాటు రజకార్లు వేలాది మందిని పొట్టనబెట్టుకున్నారని చరిత్రకారులు చెబుతారు. సయ్యద్ ఖాసిమ్ రజ్వి నేతృత్వంలోని రజాకార్లు.. పన్నులు వసూలు చేయడంతోపాటు హింసాత్మక దాడులకు పూనుకునేవారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా గొంతెత్తే వారిపై మెరుపు వేగంతో దాడులు చేయడం, దౌర్జన్యాలకు పాల్పడడం.. గ్రామాలపై దండెత్తడం.. మత మార్పిడులకు పాల్పడటం లాంటివి చేసేవారు. ఇంకా హిందూ గ్రామాలపై కూడా దాడులు చేసిన అరాచకాలకు పాల్పడేవారని, అందుకే ప్రజలు వారిని చూస్తే భయభ్రాంతులకు గురయ్యే వారని చరిత్రకారులు చెబుతారు. ముఖ్యంగా ఖాసిమ్ రజ్వి నాయకత్వంలో రజకార్లు ఎక్కువగా అరచకాలకు పాల్పడ్డారని వారికి వ్యతిరేకంగా కమ్యునిస్టులు దళాలుగా ఏర్పడి పోరాడేవారని చరత్ర చెబుతోంది.

ఎంఐఎం చరిత్ర.. రజాకార్లు..

1927లో అప్పటి నిజాం నవాబు బహదూర్ యార్ జంగ్ ‘ఎంఐఎం’ పార్టీని స్థాపించారు. దీని పూర్తి పేరు ‘మజ్లిస్-ఇ-ఇత్తెహదుల్ ముస్లిమీన్ పార్టీ’. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. 1938లో బహదూర్ యార్ జంగ్ MIM ప్రెసిడెంట్ గా ఎన్నికైన క్రమంలో.. రజాకార్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు.. రజాకార్లు అంటే శాంతిని వాంచించే ‘స్వచ్ఛంద సేవకులు’ అని అర్థం.. మతపరమైన భావాజాలంతో ఏర్పడిన ప్రైవేటు సైన్యం రజకార్లు.. ముస్లిం లీగ్ తో పాటు, బ్రిటీష్-ఆక్రమిత భారత దళాధిపతుల సహచరులుగా పనిచేసేవారు.1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తరువాత, సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రజాకార్ల స్వరూపమే మారిపోయింది.

మహారాష్ట్ర లాతూర్ కు చెందిన ఖాసీం రజ్వీ .. రజాకార్లను సైనిక శక్తిగా మార్చాడు. రజాకార్లలో మొత్తం 50,000 మంది సైనికులు ఉండేవారు. ఖాసీరజ్వీ రజాకార్ సైన్యంలో విసూనూరి దేశముఖ్, రాంచెందర్ రెడ్డి దీనికి డిప్యూటీ కమేండర్ లుగా పనిచేశారు. రజాకార్లలో ముస్లింలతోపాటు.. హిందువులు కూడా పనిచేశారని చరత్రకారులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రజలపై దాడులు ఎక్కువగా జరిగాయి.

ఆపరేషన్ పోలో: ది పోలీస్ యాక్షన్ ఎగైనెస్ట్ హైదరాబాద్..

1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం రాగా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత్ లో విలీనం కాలేదు. ఆ తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసిన స్వయంప్రతిపత్తికి బ్రిటిష్ వారితో పాటు అటు భారత్ కూడా తిరస్కరించాయి. చివరకు, భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పోలీస్ చర్యను ( ఆపరేషన్ పోలో: ది పోలీస్ యాక్షన్ ఎగైనెస్ట్ హైదరాబాద్) చేపట్టింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభం కాగా.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని ఆఖరి నిజాం.. భారత ప్రభుత్వానికి స్వాధీనం చేశారు.

ఆ తర్వాత రజాకార్ల సైన్యంలో చాలా మంది పాకిస్తాన్ కు పారిపోయారు. మిగిలిపోయినవాళ్లు కొందరు రజాకార్ల శైలి గెడ్డాలు తీసేసి.. మామూలు పౌరుల్లో కలిసిపోయారని సమాచారం. ఈ సైనిక చర్యలో భారత సైన్యం రజాకార్ల సైన్యంలో చాలా మందిని చంపేసినట్లు కూడా కొన్ని పుస్తకాల్లో రాశారు. చివరకు ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కు పారిపోతుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 1957 సెప్టెంబర్ 11న జైలు నుంచి విడుదలైన తర్వాత ఖాసిం రజ్వీ పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.

అయితే, అప్పట్లో ఖాసీ రజ్వీ నేతృత్వంలో రజాకార్లు చేసిన అరచకాలు, దమనకాండ, ఆకృత్యాలు సజీవ సాక్ష్యంగా ప్రస్తుతం రజకార్లు సినిమా తీస్తుండటం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..