AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులకు అలర్ట్.. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన..

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది వ్యవసాయ శాఖ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రారంభించిందని వెల్లడించింది.

Telangana: రైతులకు అలర్ట్.. ధాన్యం కొనుగోళ్లపై రేవంత్‌ సర్కార్‌ కీలక ప్రకటన..
Paddy Procurement
Shaik Madar Saheb
|

Updated on: Apr 09, 2024 | 9:12 AM

Share

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించిన‌ట్లు తెలంగాణ వ్యవ‌సాయ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రారంభించిందని చెప్పారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివ‌ర‌కు 433 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు జరిగిన‌ట్లు వెల్లడించారు.

ఇక.. ఈ యాసంగి సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. ఇప్పటి వ‌ర‌కు 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో 1,727 కేంద్రాలు రెండు రోజుల్లో తెరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే అయిదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయని.. అయితే.. గతేడాది ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కూడా కాలేదన్నారు.

ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే.. వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని చెప్పారు. ఇక.. పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ వ‌ద్ద 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని.. దాదాపు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ప్రస్తుతం గన్నీ సంచులు సరిపోతాయన్నారు.

మిగతా గన్నీ సంచులను వీలైనంత త్వరగానే కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. మొత్తంగా.. యాసంగి పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ వ్యవసాయ శాఖ ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
'ఈశ్వర్'లో ప్రభాస్‌తో నటించిన ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా?
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
మీ బైక్‌కు మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చారా..? ఇక నుజ్జు నుజ్జే..
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!
ప్రోటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలు దెబ్బతింటాయా? అసలు నిజం ఇదే!
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? మీరు నష్టపోయేది ఏమిటో తెలుసా
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? మీరు నష్టపోయేది ఏమిటో తెలుసా
శని ఉంగరం ఏ వేలికి ధరించాలి? ఈ నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు..
శని ఉంగరం ఏ వేలికి ధరించాలి? ఈ నియమాలు పాటిస్తేనే శుభ ఫలితాలు..
జైల్లో అరాచకం.. 25 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
జైల్లో అరాచకం.. 25 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి వ్యాపారంలో బంపర్ లాభాలు!
లాభ దృష్టి రాజయోగం.. ఈ రాశుల వారికి వ్యాపారంలో బంపర్ లాభాలు!
ఏపీలో కొత్త పథకం.. వారికి రూ.5 వేలు..
ఏపీలో కొత్త పథకం.. వారికి రూ.5 వేలు..
సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన..
సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటో.. ప్రభుత్వ బడికి ఊపిరి పోసిన..