AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Falaknuma Stepwell : నిజాం కాలం నాటి మరో ‘మెట్ల బావి’కి మహార్ధశ.. పునర్వైభవం దిశగా అడుగులు

సుమారు 53 అడుగుల లోతున్న ఈ బావిలో సుమారు 22 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రతి రోజూ తెల్లవారేకల్లా సహజసిద్దంగా ఐదు నుంచి అరడుగుల ఎత్తు మేరకు స్వచ్ఛమైన నీరు ఊట ద్వారా వస్తున్నట్టు గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సహే స్వచ్చంధ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే

Falaknuma Stepwell : నిజాం కాలం నాటి మరో ‘మెట్ల బావి’కి మహార్ధశ.. పునర్వైభవం దిశగా అడుగులు
Stepwell In Falaknuma
Jyothi Gadda
|

Updated on: May 11, 2023 | 7:42 AM

Share

శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే మెట్ల బావుల పరిరక్షణకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టి.. బావితరాలకు అందించేందుకు నడుంబిగించింది. ఇందులోభాగంగానే బల్దియా, హెచ్‌ఎండీఏ ప్రత్యేక చొరవతో ఫలక్‌నూమ బస్ డిపో దగ్గర ఉన్న మెట్ల బావి మళ్లీ జీవం పోసుకుంది.

హైదరాబాద్​లో మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణకు.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ సిద్ధమైంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి మెట్ల బావి ఫలక్​నుమా బస్​ డిపోలో ఉన్న విషయం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగా గత నెల 3న.. ఇందుకు భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేశ్​తో కలిసి అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు. ఫలక్​నుమా ప్యాలెస్​కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావిని.. నిజాం తన వ్యక్తిగత ఈత కొలనుగా వాడేవారని తెలుస్తోంది. ఈ మేరకు దీని పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ , జీహెచ్ఎంసీ, సాహీ అనే ఎన్జీవో సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

గతంలోనూ బన్సీలాల్‌పేట్‌లో 3 శతాబ్దాల కిందట నిర్మించిన నాగన్నకుంట మెట్ల బావిని.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ కలిసి పునరద్ధరించారు. బన్సీలాల్ పేట మెట్ల బావి పునరుద్ధరణకు ఆరు నెలల సమయం పట్టింది. ఈ బావి నుంచి దాదాపు 500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ఈ క్రమంలో పాతకాలపు కత్తులు, దేవతా విగ్రహాలు, ఇంటి సామగ్రి లభ్యమయ్యాయి. వీటన్నింటిని ఈ బావి సమీపంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజల సందర్శన కోసం ఉంచారు. సుమారు 53 అడుగుల లోతున్న ఈ బావిలో సుమారు 22 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రతి రోజూ తెల్లవారేకల్లా సహజసిద్దంగా ఐదు నుంచి అరడుగుల ఎత్తు మేరకు స్వచ్ఛమైన నీరు ఊట ద్వారా వస్తున్నట్టు గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సహే స్వచ్చంధ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఓయూలో ఉన్న మెట్ల బావులను కూడా పునరుద్ధరించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..