AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..

పాము కనిపిస్తేనే చాలా మంది గజగజ వణికిపోతారు. అయితే అదే పాముతో వ్యాపారం చేసేవాళ్లు లేకపోలేదు. అవును కొన్ని అరుదైన పాములతో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తుంటారు. తాజాగా షాద్‌నగర్ ఫరూఖ్ నగర్‌లో ప్రత్యక్షమైన అరుదైన ఎర్ర ఇసుక బోవా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రెండు తలలు ఉన్నట్టు కనిపించే ఈ పాము వెనుక ఉన్న రహస్యమేంటి? అనేది తెలుసుకుందాం..

అరుదైన పాము.. కోట్లలో వ్యాపారం.. దీన్ని గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు..
Rare Red Sand Boa Rescued In Shadnagar
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 20, 2026 | 1:56 PM

Share

ఆ పాము కనిపిస్తే అదృష్టం అని కొందరు.. కోట్లు కురిపిస్తుందని మరికొందరు.. దాన్ని చంపితే పాపం అని ఇంకొందరు.. ఇలా రకరకాల పుకార్లు, మూఢనమ్మకాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఎర్ర ఇసుక బోవా తాజాగా షాద్‌నగర్ పరిధిలో ప్రత్యక్షమైంది. అరుదైన ఈ రెండు తలల పాము జనావాసాల్లోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ఫరూఖ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో ఈ వింత పాము ప్రత్యక్షమైంది. అక్కడ పనిచేస్తున్న షఫీ అనే వ్యక్తికి వింతగా కనిపిస్తున్న ఈ పాము కంటపడింది. వెంటనే అప్రమత్తమైన ఆయన, ఇది అరుదైన జాతి పాము అని గుర్తించి ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులను రంగంలోకి దించారు.

రెండు తలల పాము.. దీని స్పెషాలిటీ ఏంటీ? సాధారణంగా దీనికి రెండు తలలు ఉండవు. కానీ దీని తోక కూడా తల లాగే మొద్దుబారి ఉండటంతో చూసేవారికి రెండు వైపులా తలలు ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది. అందుకే దీనికి రెండు తలల పాము అని పేరు వచ్చింది. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. విషపూరితమైనది కాకపోయినప్పటికీ దీని రూపురేఖలు చూసి జనం భయపడతారు. ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్లాది రూపాయల విలువ ఉంటుందని, దీనితో చేసే క్షుద్రపూజలు ధనాన్ని కురిపిస్తాయని, అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మందుల తయారీలో వాడతారని ప్రచారం ఉంది. ఈ మూఢనమ్మకాలే ఈ పాము పాలిట శాపంగా మారాయి.

అరుదుగా కనిపించే ఈ పాములను పట్టుకుని స్మగ్లర్లు భారీ ధరలకు అమ్ముతుంటారు. ఇది అంతరించిపోతున్న జాతి కావడంతో దీన్ని వేటాడటం లేదా ఇంట్లో ఉంచుకోవడం చట్టరీత్యా నేరం. పోలీసుల సమాచారం మేరకు ఫరూఖ్ నగర్ చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఎర్ర ఇసుక బోవాను సురక్షితంగా బంధించారు. దాన్ని పరీక్షించిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సకాలంలో సమాచారం అందించిన షఫీని అధికారులు అభినందించారు.

Follow Us