నీతా అంబానీ చర్మ రహస్యం ఇదే.. ఒక్క జ్యూస్‌తో  మెరిసే చర్మం మీ సొంతం!

samatha

06 may 2026

అపర కుభేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. 60 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఫిట్ గా ఉంటుంది.

నీతా అంబానీ

దీంతో చాలా మంది ఆమె జీవన శైలి, తాను తీసుకునే ఆహారం, జాగ్రత్తల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.

జీవన శైలి

కాగా, నీతా అంబాని బ్యూటీ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని నివేదికల ప్రకారం ఆమె ప్రతి రోజూ తప్పకుండా రెండు గ్లాస్‌ల జ్యూస్ తాగుతుందంట.

బ్యూటీ సీక్రె ట్

నీతా అంబానీ మెరిసే చర్మం కోసం ప్రతి రోజూ ఉదయం రెండు గ్లాస్‌ల బీట్ రూట్ జ్యూస్ తాగుతుందంట. ఇదే ఆమె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందంట.

బీట్ రూట్ జ్యూస్

అయితే తాను తన కుమారుడు అనంత్ అంబానీ  బరువు తగ్గే సమయంలో తనకు మద్దతు ఇవ్వడానికి ప్రతి రోజూ బీట్ రూట్  జ్యూస్ తాగడం ప్రారంభించిందంట.

అనంత్ అంబానీ మద్దతు

ఇక బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ? ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్యానికి మంచిది

అందువలన ప్రతి రోజూ క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన ఇది వృద్ధ్యాప్య ఛాయలు తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.

చర్మానికి సహజ మెరుపు

అంతే కాకుండా రోజూ దీనిని తాగడం వలన ఇది నల్ల మచ్చలు,  ముఖంపై ఉన్న మరకలు తొలిగించి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట.

ఆరోగ్యమైన చర్మం