ఇది తెలిస్తే.. ఇకపై పుచ్చకాయ తిన్నాక తొక్కలు విసిరేయలేరు!
05 May 2026
TV9 Telugu
TV9 Telugu
వేసవిలో అధికంగా లభించే పండ్లలో పుచ్చకాయ చాలా స్పెషల్. రుచికి తియ్యగా.. మంచి ఎరుపు రంగులో భలే ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే మనలో చాలా మంది లోపలి ఎరుపు రంగు భాగాన్ని తినేసి బయట ఉండే తెల్లటి పొరతో కూడిన పచ్చని తొక్కను మాత్రం వృథాగా పారేస్తుంటారు
TV9 Telugu
పారేసే ఆ భాగమే అసలు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలోని తెల్లటి తొక్క భాగంలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయట
TV9 Telugu
పుచ్చకాయలోని తెల్లటి తొక్క భాగంలో ఉండే ఎల్-సిట్రులిన్ అనే అమినో ఆమ్లం శరీరంలో ఆర్జినిన్‌గా మారి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ ప్రక్రియ రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
TV9 Telugu
దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ తెల్లటి తొక్కలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, రైబోఫ్లేవిన్, విటమిన్ ఎ, ప్రీకర్సర్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీర మెటబాలిజాన్ని సపోర్ట్ చేస్తాయి. అలాగే శరీరంలోని రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి
TV9 Telugu
పుచ్చకాయ తొక్కను ఆహారంలో చేర్చుకోవడం చాలా సులభం. దీనిని స్మూతీల్లో కలపవచ్చు, చట్నీగా తయారు చేసుకోవచ్చు, కూరలలో వేపుడు రూపంలో వాడుకోవచ్చు లేదా పచ్చడి కూడా పెట్టొచ్చు
TV9 Telugu
ఇలా చేస్తే రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. సాధారణంగా వృథా చేసే పుచ్చకాయ తొక్కలోనే గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు దాగి ఉన్నాయి
TV9 Telugu
కాబట్టి ఇకపై పుచ్చకాయ తిన్న తర్వాత ఆ తెల్లటి భాగాన్ని పారేయకుండా, తెలివిగా వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు