Rain Alert: చల్లని కబురు.. తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు..

Tealangana Weahter Forecast: తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు విపరీతంగా వస్తుండగా.. మరోవైపు వర్షాలు

Rain Alert: చల్లని కబురు.. తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు..
Rain Alert
Follow us

|

Updated on: Apr 25, 2021 | 8:35 AM

Tealangana Weahter Forecast: తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు విపరీతంగా వస్తుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి తెలంగాలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి మరో ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తూర్పు, ఉత్తర ఉపరిత ఆవర్తన మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించారు. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది.

Also Read:

Accident: తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..

Covid 19 norms Violated: కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కిన మాజీ ఎమ్మెల్యే.. ఓ స్టార్ హీరోతో కలిసి చిందులేసిన జేడీయు నేత