AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: తెలంగాణలో కరోనా మహోగ్రరూపం.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. నిన్న ఒక్కరోజే 38 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి, అంతే స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.

Telangana Corona: తెలంగాణలో కరోనా మహోగ్రరూపం.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. నిన్న ఒక్కరోజే 38 మంది మృతి
covid cases decline in up
Balaraju Goud
|

Updated on: Apr 25, 2021 | 9:52 AM

Share

Telangana Reports Coronavirus Cases: తెలంగాణలో కరోనా కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి, అంతే స్థాయిలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించింది. ఇక , తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు 1,08,602 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, రికార్డు స్థాయిలో 8,126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6 3,95,232 కు చేరింది. ఇక, నిన్న ఒక్కరోజే 38 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగ మృతి చెందిన వారి సంఖ్య 1,999కు చేరింది. రోజు రోజుకు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కాగా, శనివారం కరోనాను జయించి 3,307 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,30,304 మంది డిశ్చార్జ్ కాగా, 62,929 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,259, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 676, రంగారెడ్డిలో 591, నిజామాబాద్ జిల్లాలో 497 కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇక, తెలంగాణలోని జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి….

Telangana Corona Virus

Telangana Corona Virus

Read Also… Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’.. కీలక అంశాలపై మాట్లాడనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Follow Us