AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona effect: పచ్చని పల్లెల్లో కరోనా చిచ్చు.. వీధి నాటకం కొంప ముంచింది.. ఊరూ ఊరంతా క్వారెంటైన్ చేసింది.. అసలేం జరిగిందంటే..!

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం ఉంటూ , ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటే కరోనా దరిచేరదంటున్నారు. ఇదే అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తూ టీవీ 9 విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది.

Corona effect: పచ్చని పల్లెల్లో కరోనా చిచ్చు.. వీధి నాటకం కొంప ముంచింది.. ఊరూ ఊరంతా క్వారెంటైన్ చేసింది.. అసలేం జరిగిందంటే..!
Total Village In Quarantine
Balaraju Goud
|

Updated on: Apr 25, 2021 | 11:04 AM

Share

Total Village in Quarantineప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తమే ప్రాణ రక్ష అని నిపుణుల చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం ఉంటూ , ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటే కరోనా దరిచేరదంటున్నారు. ఇదే అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తూ టీవీ 9 విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది. ఇదే క్రమంలో టీవి9 ఇంపాక్ట్‌తో మంచిర్యాల జిల్లా అధికారులు స్పందించారు. గ్రామాల్లో, నగరాల్లో కరోనా నిబంధనలు పాటించాలంటూ ఊరూరా దండోరా వేయిస్తున్నారు. జిల్లాలో జాతరలు, వీధి నాటకాలపై నిషేదం అమల్లోకి తీసుకువస్తున్నారు. గడప దాటితే మాస్క్ తప్పని‌సరి.. పక్కింటికి వెళ్లి ముచ్చట్లు పెడితే రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో దండోరా వేస్తున్నారు జిల్లా కలెక్టర్. ఇంతకీ మంచిర్యాల జిల్లాలో ఏం జరిగింది? పల్లెల్లో దండోరా వేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? పొలం పనులు చేసుకుంటూ.. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఈ అలజడికి కారణం ఏంటని అనుకుంటున్నారు. కదా… చెన్నూరూ మండలంలో జరిగిన ఓ ఘటనే ఈ దండోరాకు ప్రధాన కారణమైంది. వీధి నాటకం.. ఈ పేరు వింటే చాలూ ఊళ్లల్లో కొంతమందికి పూనకం వచ్చేస్తుంది. మొదలుపెట్టక ముందే.. వేదిక ప్రాంగణానికి వెళ్లిపోతారు. చెవులు రెక్కించి మరీ నాటకాన్ని ఆసాంతం ఆలకిస్తారు. కానీ అదే నాటకం.. ఊరు ఊరంతటినీ క్వారంటైన్ చేసింది.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరసాల గ్రామమిది. రాష్ట్రమంతటా కరోనా విజృంభిస్తున్నా.. ఈ పల్లె మాత్రం చీకూ చింత లేకుండా హాయిగా నిద్రపోయేది. ఇది మొన్నటి మాట. కానీ ఉన్నట్టుండి కరోనా పేరు వింటేనే వణికిపోతుంది. ఊళ్లో 15రోజుల క్రితం రామాయణం అనే నాటక ప్రదర్శన ఐదురోజుల పాటు జరిగింది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన నాటకానికి చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామస్తులంతా హాజరయ్యారు. మాస్క్‌ మరిచారు. భౌతిక దూరం గాలికి వదిలేశారు. గుంపులు గుంపులుగా ఎగబడి మరీ నాటకాన్నీ వీక్షించారు. ప్రదర్శనకారుల నాటనాపాటవాలు చూసి వారెవ్వా అనుకున్నారు.

వాళ్ల ఆనందంలో వాళ్లుంటే.. సందట్లో సడేమియాలా ఎంట్రీ ఇచ్చింది మాయదారి మహమ్మారి. నాటకం అయిపోయాక కొందరికి దగ్గు, జలుబు వస్తే.. మరికొందరు జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడ్డారు. సడెన్‌గా ఎందుకిలా అవుతోందంటూ కొందరు కరోనా టెస్ట్‌లకు వెళ్లారు. ఇంకేం.. అనుకున్నదే అయింది. నాటకానికి వెళ్లిన దాదాపు 100మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నాటకాన్ని ప్రదర్శించిన వారి నుంచే ఇది సొకినట్టు తేలింది.

అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పల్లె.. కరోనా కల్లోలంతో ఊరు ఊరంతా ఉలిక్కిపడింది. మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. బాధితుల్లో 22మంది వృద్ధులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడూ సందడిగా ఉండే సుందరశాలలో ఇప్పుడు నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. అంతా అయిపోయాక జాగ్రత్తలు పాటిస్తున్నామంటున్నారు గ్రామస్తులు.

Read Also…  COVID-19 Care: కరోనా విజృంభణ.. ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు.. మోహరిస్తున్న రైల్వేశాఖ

Follow Us