Rahul Gandhi in Telangana: పొత్తు గురించి మాట్లాడితే బహిష్కరిస్తాం.. టీఆర్ఎస్‌తో పొత్తు లేదని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ

టీఆర్ఎస్‌తో పొత్తు లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీతో..

Rahul Gandhi in Telangana: పొత్తు గురించి మాట్లాడితే బహిష్కరిస్తాం.. టీఆర్ఎస్‌తో పొత్తు లేదని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ
Rahul Gandhi
Follow us

|

Updated on: May 06, 2022 | 9:01 PM

కాంగ్రెస్ విధానాల్ని విమర్శించినా సహించేది లేదన్నారు. ఎంత పెద్ద వారైనా పార్టీ నుంచి బయటకు నెట్టేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హనుమకొండలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో(Rythu Sangharshana Sabha) ఈ హెచ్చరికలు చేశారు. ఎన్నికల సమయంలో టికెట్ ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేసిన వారికే మెరిట్ ఆధారంగా టికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంత పెద్దవారైనా సరే.. రైతుల తరఫున, పేద ప్రజల తరఫున, యువత ఉద్యోగం గురించి పోరాటం చేయరో వారికి టికెట్ దొరకతని తేల్చి చెప్పారు.

టీఆర్ఎస్‌తో పొత్తు లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని వార్నింగ్ ఇచ్చారు. అది ఎంత పెద్ద నాయకుడైనా వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. అలా సంబంధాలు పెట్టుకున్నవారు ఎవరైనే ఉంటే… అదే నాయకులైనా.. కార్యకర్తలైన సహించేదిలేదన్నారు. అలాంటివారు తమ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్, బీజేపీలో వెల్లవచ్చన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే కలిసి పనిచేశాయని.. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ సహకరిస్తోందని విమర్శించారు. మోదీ సర్కార్ 3 నల్ల చట్టాలను తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని అన్నారు. తెలంగాణలో సొంతంగా గెలవలేమని బీజేపీకు తెలుసన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోందని.. కేసీఆర్ పార్టీ రిమోట్‌ బీజేపీ చేతిలో ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం

ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..

AP Politics: సీఎం జగన్‌ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..

Minister Srinivas Goud: ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా.. బండి సంజ‌య్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్..

Latest Articles