Minister KTR: వర్ష కాల ప్రణాళికను త్వరగా పూర్తిచేయండి.. జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష..
హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాల పైన పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు(Minister KTR) ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో..
హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాల పైన పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు(Minister KTR) ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్. జిహెచ్ఎంసి, ఇతర విభాగాలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వర్ష కాల ప్రణాళికను త్వరగా పూర్తిచేయాలని.. ఒకవేళ నగరంలో భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలపై ఆయన ప్రధానంగా చర్చించారు.
వరద నివారణ కార్యక్రమాలను జిహెచ్ఎంసి, జలమండలి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించిన సమన్వయం చేసుకోవాలని సూచించారు. జలమండలి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్న యస్టిపిల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లో లింకు రోడ్ల నిర్మాణం, స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ కార్యక్రమం, హైదరాబాద్ రోడ్ల నిర్మాణం పై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..
AP Politics: సీఎం జగన్ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..