Bharat Jodo Yatra: బీజేపీ, టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన రాహుల్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం..
నారాయణపేట జిల్లాలో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో సాగిన పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌పై రాహుల్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై రాహుల్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్లపై హాట్ కామెంట్స్ చేశారు రాహుల్‌గాంధీ. నాణానికి చెరో వైపులా.. బీజేపీ, టీఆర్‌ఎస్.. రెండూ ఒక్కటేనన్నారు. ధన రాజకీయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఫైరయ్యారు. దేశంలో బీజేపీ.. తెలంగాణలో టీఆర్‌ఎస్ అరాచకం చేస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు రాహుల్. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా సాగుతోంది. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర… దండు, కాచ్వార్, బొందలకుంట, జక్లేర్ గ్రామాల మీదుగా గుండిగండ్ల వరకు సాగింది. జనం సమస్యల్ని వింటూ, రైతులతో మాట్లాడుతూ నడక కొనసాగించారు రాహుల్. గుడిగండ్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు రాహుల్‌గాంధీ. కార్యకర్త ఇంట్లో టీ తాగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్… రెండూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు రాహుల్. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ రాజకీయాలను ధనమయం చేశారని ఫైరయ్యారు. గుండిగండ్ల సభకు ముందు ఒగ్గుడోలు కళాకారులతో కలిసి సందడి చేశారు రాహుల్. సరదాగా డోలు కొడుతూ దరువు వేశారు.
సెకండ్ డే… 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. దారి పొడవున… ప్రజలు, రైతులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలు, బీడీ కార్మికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు రాహుల్‌గాంధీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
