Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు తెలంగాణలో స్మాల్ బ్రేక్.. ఢిల్లీకి బయలుదేరిన రాహుల్ గాంధీ.. తిరిగి..
తెలంగాణలో తొలిరోజు పాదయాత్ర ముగించుకుని ఢిల్లీ బయల్దేరి వెళ్లారు రాహుల్‌గాంధీ. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేతకు ఘన స్వాగతం పలికింది కాంగ్రెస్ క్యాడర్. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో భారత్ జోడో యాత్ర కిక్కిరిసిపోయింది.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం నాడు ముగిసింది. ఈ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లాలోని ఎర్మారస్ నుండి నారాయణపేట జిల్లాలోని గూడబల్లూరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. మక్తల్ కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు రాహుల్. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితరులు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. మొదటి రోజున రాహుల్ గాంధీ నాలుగు కి.మీ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతకు ఘన స్వాగతం పలికింది కాంగ్రెస్ క్యాడర్. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో భారత్ జోడో యాత్ర కిక్కిరిసిపోయింది. తెలంగాణ సరిహద్దులో రాహుల్ గాంధీ పాదయాత్ర నాలుగు కిలోమీటర్లు సాగింది. నాలుగు కి.మీ. పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రను ముగించుకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది. వేలాది మంది కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రాహుల్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. భారీ జన సందోహంతో పాదయాత్రలో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
తెలంగాణలో 12 రోజుల పాటు జోడో యాత్ర కొనసాగుతోంది. మొత్తం 375 కిలోమీటర్లు రాహుల్ నడుస్తారు. శుక్రవారం దీపావళి పండగతో మూడు రోజులపాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి చేరకుంటారు. ఈ నెల 24, 25 , 26 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నారు.
#WATCH | Congress MP Rahul Gandhi resumes ‘Bharat Jodo Yatra’ from Yermarus, Raichur in Karnataka pic.twitter.com/f7emHJBgfV
— ANI (@ANI) October 23, 2022
దీపావళిని దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరారు. ఈ నెల 24,25 , 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 26న ఎఐసీసీ చీఫ్ గా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి మక్తల్ చేరుకుంటారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం