హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ ఎట్టకేలకు వీడంది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్‌లో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. అతడిపై ఉన్న కేసులు సహా కనిపించకుండాపోవడం వెనుక కారణాలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మధు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్‌ఫకు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా మెలిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పుట్టామధు కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడంతో ఈ కేసు విషయంలో భయంతోనే పుట్టా మధు కనిపించకుండా పోయారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
పుట్ట మధు అజ్ఞాతంపై ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చారు. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని శైలజ వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని, ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని పేర్కొన్నారు. తాము టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
Also Read: చిన్నారుల నుంచి కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది..వారికి వైరస్ సోకకుండా జాగ్రత్త పడాల్సిందే!