కనక వర్షం కురిపిస్తున్న నాటుకోళ్ల బిజినెస్! పోషకాలు ఫుల్.. ఆదాయం డబుల్
నాటు కోడి మాంసం కొరతను తీర్చడానికి ఆదిలాబాద్ మహిళా సంఘాలు అద్భుత వ్యాపారం మొదలుపెట్టాయి. 20 కోడి పిల్లలతో ప్రారంభించి, మూడు నెలల్లో 300 కోళ్లకు పెంచి, ఒక్కో కోడిని రూ.600కు పైగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, సంప్రదాయ నాటు కోడి పెంపకాన్ని పునరుద్ధరిస్తోంది.

నాన్ వెజ్ ప్రియులకు నాటు కోడీ అంటే ఓ ఎమోషన్. సండే వచ్చిదంటే నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులోను నాటుకోడి అయితే ఇక సందడి డబుల్ అయినట్టు. నాటుకోడి పులుసు.. ఆ పేరు వినగానే చాలా మంది నోళ్లలో నీళ్లూరుతాయి. వైట్ రైస్‌తో తిన్నా, రాగి సంకటితో లాగించినా, బిర్యానీలో నంజుకున్నా ఆ రుచి వేరే లెవెల్. కానీ బాయిలర్ కోళ్లు దొరికినంత ఈజీగా నాటు కోడి మాంసం దొరకడం లేదు. ప్రతిరోజు కాకపోయిన వారంలో ఒక్క రోజైనా.. కనీసం పండుగ పూట అయినా నాటుకోడిని తిందామంటే నిరాశనే ఎదురవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోను నాటు కోళ్ల పెంపకం చాలా వరకునిలిచిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ జిల్లా మహిళా సమక్య సభ్యులు నాటుకోళ్ల వ్యాపారంలోకి ధైర్యంగా అడుగు పెట్టారు. కేవలం 20 కోడి పిల్లలతో వ్యాపారాన్ని మొదలు పెట్టి కేవలం మూడు నెలల వ్యవదిలో మూడు వందల కోళ్లకు చేర్చారు. ఒక్కో కోడిని 600 కు పైగా అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు.
ఆదివారం వస్తే చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు. అందుకు తగ్గట్టుగానే వీధికో చికెన్ షాపు దర్శనమిస్తుంది. మార్కెట్‌లోనూ అందుకోసం పలు బ్రాండ్లు ఉన్నాయి. అల్లుడొచ్చినప్పుడో, పండుగ సమయాల్లోనో ప్రత్యేకంగా తీసుకొచ్చే నాటుకోడి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అలాంటి నాణ్యమైన మాంసాన్నే బ్రాయిలర్ చికెన్‌లా ప్రతి గ్రామంలోను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నాటు కోళ్ల పెంపకాన్ని ప్రొత్సహిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 473 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 557 గ్రామ సమైక్య సంఘాలు, 11,294 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 1,24,643 మంది సభ్యులు ఉన్నారు. సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. వాటి ద్వారా అధిక ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 2,370 యూనిట్లు పంపిణీ లక్ష్యంగా సెర్చ్ నిర్దేశించారు.
ఇప్పటివరకు 1450 యూనిట్లు పంపిణీ
వ్యాక్సినేషన్ చేసిన 50 కోడి పిల్లలను ఒక యూనిట్‌గా చేర్చారు. ఒక కోడి పిల్ల ధర రూ.110 గా నిర్ణయించారు. వీటికి వ్యాక్సినేషన్ చేసి అందించడంతో బాగా పెరుగుతున్నాయి. మూడు నెలల పాటు పెంచితే నాలుగింతలకు పైగా ఆదాయం పొందుతున్నారు. బయట మార్కెట్ లో కిలో ధర రూ.600కు పైగా లభిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
