AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Professor Saibaba: తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రొఫెసర్ సాయిబాబా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.. ఆందోళనలో కుటుంబం సభ్యులు..

Central Govt: అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.

Professor Saibaba: తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రొఫెసర్ సాయిబాబా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ.. ఆందోళనలో కుటుంబం సభ్యులు..
Shiva Prajapati
|

Updated on: Feb 15, 2021 | 8:12 AM

Share

Professor Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాబాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన భార్య వసంత వెల్లడించారు. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో యుఏపీఏ చట్టం కింద అరెస్టైన సాయిబాబా.. మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత ప్రకటన విడుదల చేశారు. 90శాతానికి పైగా అంగ వైకల్యం, కిడ్నీ, గుండె సంంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రొఫెసర్ సాయిబాబా.. ప్రస్తుతం తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

తన భర్తకు మెరుగైన వైద్యం అందించించడం లేదని ఆరోపించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు తన భర్తను అధికారులు కలుసుకోనివ్వలేదని ఆరోపించిన వసంత.. కోర్టును ఆశ్రయించి ఆయనను కలిసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అలాగే సాయిబాబాను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టును అభ్యర్థిస్తానని ఆమె తెలిపారు. కాగా, 2017 మార్చి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను మానవతా దృక్పథంతో అయినా విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also read:

PMFBY Scheme: పీఎంఎఫ్‌బీవై పథకం కింద్ర వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలంగాణకు రూ.148 కోట్లు..

Today Horoscope: ఫిబ్రవరి 15 రాశి ఫలాలు.. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి..