Telangana: క్షుద్ర పూజల టర్న్ తీసుకున్న తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం..

తెలంగాణా పాలిటిక్స్‌ సడన్‌గా క్షుద్ర పూజల టర్న్ తీసుకున్నాయి. రాష్ట్రంలో రూలింగ్ పార్టీ, కేంద్రంలో రూలింగ్ పార్టీల నేతలు మంత్రాలు-తంత్రాల లాంగ్వేజ్‌లో..

Telangana: క్షుద్ర పూజల టర్న్ తీసుకున్న తెలంగాణ పాలిటిక్స్.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం..
Minister Ktr Vs Mp Bandi Sanjay
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 09, 2022 | 7:29 PM

తెలంగాణా పాలిటిక్స్‌ సడన్‌గా క్షుద్ర పూజల టర్న్ తీసుకున్నాయి. రాష్ట్రంలో రూలింగ్ పార్టీ, కేంద్రంలో రూలింగ్ పార్టీల నేతలు మంత్రాలు-తంత్రాల లాంగ్వేజ్‌లో కౌంటర్లేసుకోవడం షురూ చేశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఇదొక ఇంట్రస్టింగ్‌ ఎపిసోడ్‌గా మారింది. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ తాంత్రిక పూజలు చేశారని బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. కేసీఆర్ ఫ్యామిలీ కాళేశ్వరం టూరేసింది అందుకేనన్నది బండి కామెంట్ చేశారు.

అయితే, బండి సంజయ్‌ కామెంట్‌కి మంత్రి కేటీఆర్‌ నుంచి వెంటనే కౌంటర్ పడింది. ఈ లవంగం గారికి ఎర్రగడ్డలో చికిత్స ఇప్పించండని, లేదంటే ఇలాంటి మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా మారతారు అంటూ ట్విట్టర్‌ ద్వారా చురకంటించారు కేటీఆర్. మిగతా టీఆర్‌ఎస్ నేతలు కూడా బండి వ్యాఖ్యల్ని సీరియస్‌గానే తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ నిత్య పూజలు చేసే కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌.

అటు.. బండి మాటల్ని అడాప్ట్ చేసుకుని, తాంత్రిక పూజల టాపిక్‌ని కంటిన్యూ చేశారు కమలం నేతలు. పార్టీ పేరు మార్చకపోతే, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న తాంత్రికుల సూచన మేరకే.. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారన్నారు బీజేపీ తెలంగాణా వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టార్గెట్‌గా ఛాన్స్ దొరికితే చాలు అన్నట్లుగా ఎటాక్ చేస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం మంత్ర-తంత్రాల సబ్జెక్ట్‌నే అందుకున్నారు. తాంత్రికుల సలహా మేరకే మంత్రివర్గంలో కేసీఆర్‌ మహిళలకు చోటివ్వలేదని విమర్శించారు నిర్మల.

ఇవి కూడా చదవండి

అయితే, తెలంగాణ మంత్రివర్గంలో మహిళా మంత్రులే లేరన్న నిర్మలా సీతారామన్‌ కామెంట్స్‌కి.. వెంటనే కౌంటరిచ్చారు మంత్రి సబిత. తాను, సత్యవతి రాథోడ్ మంత్రులమేనన్నది ఆమెకు తెలీదా అంటూ రివర్స్‌ ఎటాక్ చేశారు. మీరు మహిళల శ్రేయస్సును కోరుకునేవారే ఐతే వంటగ్యాస్ ధరను తగ్గించండి అంటూ ఝలక్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ వీడియోను ట్యాగ్ చేస్తూ సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేషనల్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్‌మేజిక్ ఉందన్న బీజేపీ కామెంట్స్‌.. జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీడియా సైతం ఈ టాపిక్ మీద ఫోకస్ చేసింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే యోచనలో ఉన్న కేసీఆర్ ఈ బ్లాక్‌మార్క్‌ని తొలగించుకోవడం కోసం వీలైనంత త్వరలో స్పందించే అవకాశముందనే వాదన వినిపిస్తోంది.

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న క్రమంలో బీజేపీ – టీఆర్‌ఎస్ క్షుద్రపూజల టాపిక్‌ తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. బైపోల్‌లో అప్పర్ హ్యాండ్‌ సాధించడం కోసమే కేసీఆర్‌ మీద బీజేపీ ఇలా తాంత్రిక మంత్రం ప్రయోగించిందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ మాత్రం కేసీఆర్ బ్లాక్‌మేజిక్‌కి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయంటోంది. మరి ఈ వివాదం ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..