అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..

| Edited By: Srikar T

Jun 28, 2024 | 5:08 PM

ఇళ్ళు, బ్యాంకుల వద్ద చోరీలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో దొంగల దృష్టి రైతుల కేంద్రంగా మళ్లింది. రైతుల జీవనోపాదికి ప్రధానఅవసరమైన ఎద్దులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ రైతుకు సంబంధించిన ఎద్దులను దొంగతనం చేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..
Khammam
Follow us on

అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. బడి, గుడి, ఇల్లు, బ్యాంకులను చోరీలు చేయటం ఇప్పటివరకూ చూసాం. కానీ నేడు రైతులకు జీవనాధారంగా ఉన్న కాడే ఎడ్లను సైతం దొంగతనం చేస్తున్నారు. ఇళ్ళు, బ్యాంకుల వద్ద చోరీలపై నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో దొంగల దృష్టి రైతుల కేంద్రంగా మళ్లింది. రైతుల జీవనోపాదికి ప్రధానఅవసరమైన ఎద్దులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ రైతుకు సంబంధించిన ఎద్దులను దొంగతనం చేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాల గూడెం గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన పెరట్లో రెండు ఎడ్లను కట్టేశాడు. ఉదయాన్నే లేచి చూడగా ఎద్దులు కనిపించలేదు. దీంతో ప్రభాకర్ కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి వేళ దొంగలు ఓ వాహనంపై వచ్చి ఇంటి పెరట్లో ఉన్న రెండు ఎద్దులను ఎక్కించుకొని వెళ్లిపోయిన దృశ్యాలు చేగొమ్మ గ్రామంలోని సీసీటీవీలో కనిపించాయి. సీసీటీవీలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు జీవనాధారంగా ఉన్న సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దులను దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. పంటల సాగు సమయంలో ఎద్దులను దొంగతనం చేశారని తెలియటంతో మిగతా రైతుల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..