AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగిలం షైనీకి పోలీస్ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?

షైనీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. యస్‌.. అదే పోలీస్‌ డాగ్‌. ఉమ్మడి ఖమ్మం జిల్లా డాగ్‌స్క్వాడ్‌గా దాదాపు పదేళ్లుగా సేవలందించింది. ఎన్నో కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించింది. కానీ.. ఇప్పుడు షైనీ లేదు.

జాగిలం షైనీకి పోలీస్ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..?
Police Dog
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 11, 2024 | 9:19 PM

Share

షైనీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ. యస్‌.. అదే పోలీస్‌ డాగ్‌. ఉమ్మడి ఖమ్మం జిల్లా డాగ్‌స్క్వాడ్‌గా దాదాపు పదేళ్లుగా సేవలందించింది. ఎన్నో కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించింది. కానీ.. ఇప్పుడు షైనీ లేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. విశ్వాసానికి మారుపేరైనా షైనీ అంత్యక్రియలను పోలీసులు ఘనంగా నిర్వహించారు. షైనీ మృతి తీరని లోటని పోలీసులు దాని సేవలు కొనియాడారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. గత నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బుధవారం(సెప్టెంబర్ 11) తుది శ్వాస విడిచింది. పేలుడు పదార్థాలను కనిపెట్టడంలో నైపుణ్యత కలిగిన షైనీ మరణించడం భద్రాద్రి జిల్లాకు తీరని లోటని అడిషనల్ ఎస్పీ పంకజ్ పరితోష్ తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో జాగీలం షైనికి ఘనంగా అంతిమ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

2014 సంవత్సరంలో జన్మించిన పోలీస్ జాగిలం షైనీ 2016లో జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో విధులలో చేరి సుమారుగా పది సంవత్సరాల పాటు తన సేవలను అందించింది. 30కి పైగా పేలుడు పదార్థాలను గుర్తించిన ఘటనలో పాల్గొని సమర్థవంతంగా విధులను నిర్వర్తించిందని పోలీసులు తెలిపారు. జిల్లాలో VIP ల పర్యటనల్లో విధులు నిర్వర్తించడం, ల్యాండ్ మైన్స్ ను గుర్తించడం వంటి సేవలను అందించింది. ఎక్కువ శాతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తన సేవలు అందించిందని తెలిపారు.

అనంతరం షైనీ భౌతికకాయానికి పోలీసు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓఎస్డి కార్యాలయంలోని డాగ్ స్క్వాడ్ నుండి అంతిమయాత్రగా బయలుదేరి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు షైనీకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి