Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో మహిళా జూ. డాక్టర్‌పై దాడి.. షాకింగ్ వీడియో
దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జూడాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి కలకలం రేపింది. ఎమర్జెన్సీ వార్డులో ఓ లేడీ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు. మహిళా జూనియర్ డాక్టర్ చేయి పట్టుకుని ఆమె ఆప్రాన్ లాగి ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వీడియో చూడండి..
సీసీ ఫుటేజ్.. గాంధీ ఆస్పత్రిలో మహిళా డాక్టర్ పై దాడి
సికింద్రాబాద్ – గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది.. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె అప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్‌ను రక్షించారు. అనంతరం పోలీసులకు… pic.twitter.com/hqpfWsgZHa
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024
సమాచారం అందుకున్న పోలీసులు గాంధీ ఆస్పత్రికి చేరుకుని, దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జూడాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.