Viral Video: కడుపు మండింది.. ఓలా షోరూంను తగలెట్టాడు.. కారణం ఏంటంటే..
చివరకు కొద్దిరోజుల తర్వాత షోరూం వారు కూడా సరిగా స్పందించడం మానేసినట్లు నదీమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసినా కూడా నాసిరకం స్కూటర్‌ను ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదని కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కొందరు దీని బ్యాటరీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు బైక్ నాణ్యత గురించి ఆరోపిస్తున్నారు. ఇదే సందర్భంలో తన ఓలా స్కూటర్‌లో తరచూ లోపలు తలెత్తుతున్నాయని ఆగ్రహించిన ఓ వ్యక్తి కంపెనీ షోరూమ్‌కు నిప్పుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా షోరూమ్ కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, కంప్యూటర్లు దగ్ధమైనట్టుగా తెలిసింది. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. కర్ణాటక కలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక కలబుర్గిలో మహమ్మద్ నదీమ్ అనే వ్యక్తి ఆగష్టు 28న ఓలా షోరూమ్‌లో రూ. 1.4 లక్షల విలువైన ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అయితే స్కూటర్ కొన్న రెండు రోజుల్లోనే సమస్యలు మొదలయ్యాయని నదీమ్ ఆరోపిస్తున్నాడు. స్కూటర్ బ్యాటరీ, సౌండ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. బండి మాటి మాటికి ఆగిపోవడం మొదలైంది. కొన్నిసార్లు అది స్టార్ట్ కావడం లేదు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఓలా షోరూమ్‌కు వెళ్లినా అధికారులు సరిగా పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.
చివరకు కొద్దిరోజుల తర్వాత షోరూం వారు కూడా సరిగా స్పందించడం మానేసినట్లు నదీమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసినా కూడా నాసిరకం స్కూటర్‌ను ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన టూవిలర్‌ను సరైన సమాయానికి రిపేర్ చేయలేదని కస్టమర్ సపోర్టు ఎగ్జిక్యూటివ్‌తో వాగ్వాదానికి దిగాడు. సిబ్బంది నిర్లక్ష్యంతో విసుగు చెందిన నదీమ్.. పెట్రోల్ పోసి కంపెనీ షోరూమ్‌కు నిప్పంటించాడు. షోరూమ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆరు స్కూటర్లు, కంప్యూటర్‌లు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూమ్ మూసివేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Ola स्कूटर की सर्विस से परेशान होकर एक शख्स ने कर्नाटक में पूरे के पूरे ola शोरूम में आग लगा दी।🤯🤯#BREAKING #olaelectric #Karnataka pic.twitter.com/oAKlEhHgN9
— MR.𝕏 (@nish0015) September 11, 2024
కానీ, షోరూమ్ కు నిప్పు పెట్టడంతో రూ.8.5 లక్షల నష్టం వాటిలినట్లుగా తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు నదీమ్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..