AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?

ఇంతలో ఒక నక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తొలుత ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. స్పందించిన మరో వ్యక్తి ఆ నక్కను బెదరగొట్టేందుకు రాళ్లు విసిరాడు. అది అతడి మీదకు దూసుకొచ్చింది. అయితే దాడి చేసిన నక్కను ఆ వ్యక్తి సుమారు 15 అడుగుల దూరంలోకి విసిరేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.

Watch: బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Jackal Attacks
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2024 | 5:19 PM

Share

యూపీ ప్రజల్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎట్నుంచి దాడి చేస్తాయో తెలియక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కంటి మీద నిద్రలేకుండా గ్రామస్తులు గస్తీ కాస్తున్నారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లో నక్కల బెడద పట్టుకుంది. సోమవారం రాత్రి, ఎంపీలోని సెహోర్ జిల్లాలో ఒక నక్క ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. రెహ్తీ తహసీల్‌లోని సగోనియా పంచాయతీలో రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తులపై నక్క దాడి చేసింది. ఈ భయానక ఘటన సీసీటీవీలో రికార్డయింది. అయితే దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారిద్దరూ చాలా పోరాడారు. ఒక వ్యక్తి ఆ నక్కను ఎత్తి దూరంగా విసిరేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్‌ 9న సాయంత్రం సగోనియా గ్రామంలో రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక నక్క వేగంగా వారి వద్దకు వచ్చింది. తొలుత ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపర్చింది. స్పందించిన మరో వ్యక్తి ఆ నక్కను బెదరగొట్టేందుకు రాళ్లు విసిరాడు. అది అతడి మీదకు దూసుకొచ్చింది. అయితే దాడి చేసిన నక్కను ఆ వ్యక్తి సుమారు 15 అడుగుల దూరంలోకి విసిరేశాడు. దీంతో అది అక్కడి నుంచి పారిపోయింది.

ఇవి కూడా చదవండి

కాగా, నక్క దాడిలో గాయపడిన వ్యక్తులను శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్‌గా గుర్తించారు. వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నక్క దాడిపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..