AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PresVu Eye Drops: ప్రెస్‌వూ ఐ డ్రాప్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు తుంగలో తొక్కిందంటూ..

ఇది వయస్సురీత్యా వచ్చే కంటి జబ్బు ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ ప్రెస్‌బయోపియా వ్యాధి వస్తుంది. దీనివల్ల దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. కేవలం దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఈ మందు తయారీదారు ఇప్పటికే పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా, ఈ మందు తయారీపై కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

PresVu Eye Drops: ప్రెస్‌వూ ఐ డ్రాప్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. నిబంధనలు తుంగలో తొక్కిందంటూ..
Presvu Eye Drops
Jyothi Gadda
|

Updated on: Sep 11, 2024 | 6:38 PM

Share

భారత్‌లో తయారైన ఎంటోడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన కొత్త కంటి చుక్కల మందుపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కొత్త ఐ డ్రాప్‌ను తయారు చేసి విక్రయించడానికి జారీ చేసిన అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రెస్‌వూ కంటి చుక్కల మందు ప్రెస్‌బయోపియా కోసం అభివృద్ధి చేసిన మొదటి మందు. దీంతో కంటి అద్దాల అవసరం ఉండదు. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి జబ్బు ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారిలో ఈ ప్రెస్‌బయోపియా వ్యాధి వస్తుంది. దీనివల్ల దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. కేవలం దగ్గరగా ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఈ మందు తయారీదారు ఇప్పటికే పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. కాగా, ఈ మందు తయారీపై కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ముంబైకి చెందిన ఎంటోడ్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన ఈ ఐ డ్రాప్స్‌ పేరు ప్రెస్‌వూ ఐ డ్రాప్స్‌ (Presu Eye Drops). ప్రెస్‌బయోపియా సమస్యతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 1.09-1.80 బిలియన్ల మంది బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎంటోడ్‌ ఫార్మాస్యూటికల్‌ అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CSCO), సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట కమిటీ (SEC) సిఫార్సు మేరకు డీసీజీఐ ముందుగా అనుమతించింది. కానీ, తాజాగా కేంద్రం ఈ మందు తయారీకి బ్రేక్‌ వేసింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్ పైక్లిక్ చేయండి..

ఎటోడ్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న ప్రెస్‌వూ ఐ డ్రాప్స్‌ అనధికారిక ప్రమోషన్‌ను తీవ్రంగా పరిగణించి, తయారీ, మార్కెట్‌కు సెంట్రల్‌ లైసెన్సింగ్‌ అథారిటీ అప్రూవల్‌ తీసుకోని అంశాన్ని కారణంగా చూపిస్తూ వాటి విక్రయానికి అనుమతిని నిలిపివేసింది. New Drugs and Clinical Trial Rules, 2019 కింద కంటి సొల్యూషన్‌ తయారీకి అనుమతుల నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..