Viral Video: దేవుడితో ఆటలా.. లైక్‌ల కోసం ఏమైనా చేస్తారా.? యువతి చేసిన పనికి నెటిజన్లు ఫైర్..
ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్‌లు వస్తున్నాయి. రీల్ పిచ్చితో యువతి చేసిన పనికి ఆ మహాశివుడు తగిన గుణపాఠం నేర్పించాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్, వ్యూస్ కోసం ఇలాంటి వారు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రీల్స్ కోసం కొందరు తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ చాలా మంది మరణించారు కూడా. రీల్స్ మోజులో కొందరు వేగంగా వెళ్తున్న రైలు ఢీకొని చనిపోతే, మరికొందరు నదులు, వరద ప్రవహాల్లో పడి కొట్టుకుపోయిన ఘటనలు మనం అనేకం చూశాం. అలాంటిదే ఇప్పుడు ఓ యువతి మృత్యువు అంచుకు వెళ్లింది. ఆ అమ్మాయి రీల్ తయారీ కోసం నీళ్లలో పడిపోయింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో హరిద్వార్‌కు చెందినదిగా చెబుతున్నారు. గంగా ఘాట్ వద్ద ఒక అమ్మాయి రీల్ చేస్తూ కనిపిస్తుంది. గంగా ఘాట్ వద్ద రీల్ చేస్తూ ఏదో బాధపడుతున్నట్టుగా యాక్ట్ చేసింది. నీళ్లలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద ఆ యువతి తన బాధను వెళ్లగక్కుతోంది. ఏదో భాదతో ఆ దేవుడిని పూజిస్తున్నట్లు నటిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె నదిలో భద్రత కోసం ఏర్పాటు చేసిన రైలింగ్ ఎక్కి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి గంగానదిలో పడిపోయింది. వరద ప్రవహంలో కొట్టుకుపోయింది. ఆమెను కాపాడేందుకు కొందరు పరిగెత్తే సమయానికి ఆమె మరింత దూరం కొట్టుకుపోయింది. నది ప్రవాహం వేగంగా ఉంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఈ వీడియో చూడండి..
रील की शौक़ीन इस लड़की को थोड़ी सजा देकर बहुत साफ भगवान महादेव ने बचा लिया। नहीं तो ये तो …..
वीडियो हरिद्वार के विष्णु घाट का। भगवान महादेव को भी इनका रील बनाना पसंद नहीं आया। pic.twitter.com/O3kATu4mhP
— Shubham Shukla (@ShubhamShuklaMP) September 11, 2024
వరదల ప్రవహంలో కొట్టుకుపోతున్న యువతి అదృష్టవశాత్తూ రైలింగ్ రాడ్ పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగింది. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్‌లు వస్తున్నాయి. రీల్ పిచ్చితో యువతి చేసిన పనికి ఆ మహాశివుడు తగిన గుణపాఠం నేర్పించాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్, వ్యూస్ కోసం ఇలాంటి వారు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..