Fake Ice Cream: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీరాయుళ్లు.. నకిలీ ఐస్‌క్రీం తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు..

|

Apr 19, 2023 | 7:32 AM

వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాతో రెండు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం... పట్టణంలోని నందిని, రాయల్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల్లో తనిఖీ చేశారు. కెమికల్స్, కృత్రిమ రంగులతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Fake Ice Cream: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీరాయుళ్లు.. నకిలీ ఐస్‌క్రీం తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు..
Fake Ice Creams
Follow us on

కల్తీ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం ప్రజల ప్రాణాలతో చలాగాటమాడుతున్నారు కంత్రిగాళ్లు. నూనె, కారం వంటి వంటసామాన్లు మాత్రమే కాదు.. చిన్న పిల్లలు తినే ఆహారపదార్ధాలను కూడా కల్తీ చేస్తున్నారు. నకిలీ చాక్లెట్స్ వ్యవహారం మరిచిపోక ముందే.. మరో నకిలీ పదార్ధం వెలుగులోకి వచ్చింది. తాజాగా నకిలీ ఐస్‌క్రీమ్స్‌  తయారు చేస్తున్న కేటుగాళ్లను గుర్తించారు. పిల్లలు తినే ఐస్ క్రీమ్‌ను కల్తీ చేస్తున్న కేటుగాళ్ల భరతం పడుతున్నారు పోలీసులు.

హైదరాబాద్ కేంద్రంగా ఫేక్ ఐస్‌క్రీం, చాక్లెట్లు విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు నకిలీగాళ్లు. పిల్లలు, పెద్దల ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. ఐస్ క్రీం ప్రియుల ఆసక్తిని ఆసరగా చేసుకొని.. డబ్బు మాయలో నకిలీ పదార్థాలతో ఐస్ క్రీం తయారు చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చలాగాటమాడుతున్నారు. అధికారుల దాడులతో ఈ కల్తీ ఐస్‌క్రీం తయారీ కేంద్రాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను.. టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.

వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాతో రెండు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం… పట్టణంలోని నందిని, రాయల్ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల్లో తనిఖీ చేశారు. కెమికల్స్, కృత్రిమ రంగులతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 150 కిలోల పాల పౌడర్‌తో పాటు, కాలం చెల్లిన వెనిలా ఫ్లేవర్, బటర్ స్కాచ్, మావ కుల్ఫీ, వివిధ రకాల రసాయన పదార్థాలను సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల యజమానులు… ఎలాంటి ఆహార పదార్థాల శాఖ అనుమతులు లేకుండా వీటిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ ఐస్‌క్రీమ్‌లపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సమ్మర్లో ఐస్ క్రీమ్ లకు ఉన్న డిమాండ్‌తో కేటుగాళ్లు కల్తీ ఐస్ క్రీమ్ లు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..