భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ లీడర్ అరెస్ట్.. కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..
ఖమ్మంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ లీడర్ పగడాల నాగరాజుని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కేసులో అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన కోసం స్టేషన్ బయట ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకొచ్చారు. గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

ఖమ్మంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ లీడర్ పగడాల నాగరాజుని ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కేసులో అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తుండగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన కోసం స్టేషన్ బయట ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకొచ్చారు. గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అయితే పోలీసులు వారిని బయటికి పంపించి పగడాల నాగరాజుని జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఏదుట హాజరు పరిచారు.
58,59 జీఓను ఆసరాగా చేసుకొని ఎన్.ఏస్.పి రామాలయం దగ్గర ఉన్న 415 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా క్రమబద్దీకరించుకున్నారని కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ఆమె భర్త బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజులపై ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏ1, ఏ2 లుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇక ఆయను కోర్టులో హాజరు పరిచాక పగడాల నాగరాజుకు జిల్లా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. నాటకీయ పరిణామాల మధ్య పగడాల నాగరాజును అర్థరాత్రి సబ్ జైలుకు తరలించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




