వామ్మో.. ఏసీబీకి చిక్కిన బాలకృష్ణ ఆస్తులు, నగలు, నగదు లెక్క తెలిస్తే మైండ్ బ్లాకే
ఎందెందు వెతికినా.. అందందు అవినీతే..! అవును.. HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిత్రమ్‌లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు ACB అధికారులు. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు... కోర్టులో ప్రవేశపెట్టి కటకటాల వెనక్కి నెట్టారు.

రెండు కేజీల బంగారం, ఆరు కేజీల వెండి, 32 లక్షల విలువ చేసే 80కిపైగా వాచ్‌లు, 18 ఐఫోన్‌లు, రూ. 99లక్షల 66 వేల నగదు.. 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఎకరాల భూమి, బ్యాంకు లాకర్లు, బినామీలపై ఇంకెంతో… తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ -రేరా- కార్యదర్శి శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా ఇది..! ఇది ట్రైలర్ మాత్రమే..!!! ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు వందల కోట్లు ఆస్తులు వెనకేసుకున్నట్టు అవినీతి నిరోధక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సోదాలు, విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే సంపద వెలుగు చూసింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. చేయి తడపనిదే ఫైల్ కదిలే పరిస్థితి లేదు. ఓవైపు.. అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచావతారుల భరతం పడుతున్నా…, మరోవైపు.. బహిరంగంగానే లంచాలు తీసుకోవడానికి బరితెగిస్తున్నారు. వేలల్లో.. లక్షల్లో… ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నా.. లగ్జరీ లైఫ్ కోసం.. పందికొక్కుల్లా.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అవినీతి అధికారులు.
అవినీతి తిమింగళం శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిత్రమ్ చూసి.. అందరూ షాక్‌కు గురవుతున్నారు. చేతిలో పవర్ ఉందని అడ్డంగా దిడ్డంగా సంపాదించేశాడు. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు కూడపెట్టాడు. రాజధాని కేంద్రంగా ఆయన ఆడిందే ఆటా.. పాడిందే పాట.! బడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలను సర్కార్ చేయించాడు. సిగ్నేచర్ చాటున ఆఫీసర్స్ ఛాయిస్‌గా పార్టనర్‌షిప్ దందా చేశాడు. చివరాఖరికి ఏసీపీ ఎంట్రీతో కరప్షన్ కింగ్ శివబాలకృష్ణ అవినీతి కథ కటకటాలకు చేరింది. దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Big fish has been caught.!!!!
Stacks of cash, diamond, gold and silver jewellery, properties worth crores, costly electronic gadges were unearthed from HMDA farmer director, Shiva Balakrishna's home in ACB raids today.
Example for the loot under BRS government 🤷 pic.twitter.com/QF6hYkyC03
— Gems Of Telangana (@GemsOfKCR) January 24, 2024
శివ బాలకృష్ణ.. కరప్షన్ కింగ్ అన్న మాటకు సూటయ్యేలా ఏసీబీ సోదాల్లో అతని అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఒకటా రెండా… ఏకంగా 4 వందల కోట్ల అక్రమాస్తుల చిట్టా బయటపడింది. నానక్ రామ్ గూడలోని ఆయన ఇంట్లో జువల్లెరీ షాప్‌ను తలపించే బంగారు నగులు జిగెల్మన్నాయి. బ్యాంక్ చెస్ట్ రూమ్ తరహాలో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. –Spot– 2 కేజీల బంగారు నగలు.. ఆరు కేజీల వెండి, 32 లక్షల విలువ చేసే 80కిపైగా వాచ్‌లు, 18 ఐఫోన్‌లు, రూ. 99లక్షల 66 వేల నగదు.. ఇప్పటి వరకూ దొరికాయి. ఇక ల్యాండ్ డాక్యుమెంట్ల కట్టలు కట్టలుగా కన్పించాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు సహా కల్వకుర్తిలో 26 ఎకరాలు.. జనగామలో 24, యాదాద్రిలో 23, కొడకంల్డలో 17 ఎకరాలకు సంబధించిన భూపత్రాలను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఇంకా.. బ్యాంక్ లాకర్లలో ఏం దాచాడో.. వాటిని ఎలా దోచాడో.. లెక్క తేల్చే పనిలో పడింది ఏసీబీ.
ప్రస్తుతం శివ బాలకృష్ణ మెట్రో రైల్ లిమిటెడ్‌లో ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు.. 2018 నుంచి 2023 వరకు hmdaలో కొనసాగారు.. ఆసమయంలోనే కోట్లు రూపాయల అవినీతికి పాల్పడినట్లు గుర్తించింది ఏసీబీ. శివ బాలక్రిష్ణ వచ్చిన ఫిర్యాదుల ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారం అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి అతనిపైన.
శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. బాలకృష్ణకు ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. చంచల్‌గూడ జైలుకు బాలకృష్ణను తరలించారు. అటు.. సత్యం, మూర్తి అనే ఇద్దరు బినామీలను గుర్తించారు. అయితే.. వాళ్లిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. అక్రమాస్తుల కేసులో అరెస్టైన శివ బాలకృష్ణ.. తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నారు శివ బాలకృష్ణ..
మరోవైపు.. అధికారుల దగ్గర అన్ని కోట్లు దొరికితే.. వారికి బాస్‌లుగా ఉన్న వాళ్ల ఇళ్లలో సోదాలు చేస్తే.. ఇంకెన్ని వేల కోట్లు బయటపడతాయో చూడాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ. గత ప్రభుత్వం హయాంలో చాలా అవినీతి జరిగిందని.. ప్రజల సొమ్మును వెలికి తీయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. ఈ క్రమంలో… బాలకృష్ణ అవినీతిలో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపైనా ఆరా తీస్తుంది ఏసీబీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
