AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: బీజేపీ టార్గెట్ తెలంగాణనే.. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో..

PM Modi Road Show: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణపై ఫోకస్ పెంచింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో వ్యూహాలకు పదును పెడుతోంది.

PM Modi: బీజేపీ టార్గెట్ తెలంగాణనే.. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ భారీ రోడ్ షో..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2023 | 4:13 PM

Share

PM Modi Road Show: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణపై ఫోకస్ పెంచింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో వ్యూహాలకు పదును పెడుతోంది. మిషన్‌ 90 టార్గెట్‌గా కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ రచిస్తోంది. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై పడకుండా.. కసరత్తు ప్రారంభించింది. ఐదు నెలలకు ముందుగానే బీజేపీ సమరశంఖాన్ని పూరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వరుసగా సమావేశాలను నిర్వహించడంతోపాటు.. చేరికలు.. పార్టీ విస్తరణ తదితర వ్యూహాలతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలనే రాష్ట్ర నేతలతో భేటీ అయిన అమిత్ షా.. జేపీ నడ్డా.. పలు కీలక సూచనలు చేశారు. సమన్వయంతోనే లక్ష్యం సాధించవచ్చన్న విషయాన్ని చెప్పడంతోపాటు..హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. ఢిల్లీ పెద్దల అండ ఎప్పుడూ ఉంటుందని హామీ సైతం ఇచ్చారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీని ఎలాగైనా అధికారంలో తీసుకువచ్చేందుకు ఏకంగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. త్వరలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ప్రధాని మోడీ.. తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ తో రంగంలోకి దిగనున్నట్లు కాషాయ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన, రోడ్డు షోపై పీఎంఓ నుంచి అనుమతి వచ్చిన తర్వాత బిజెపి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు అమిత్‌ షా సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. 15న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వ్యూహాలు.. సన్నాహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..