PM Modi: ప్రజలకు బీజేపీపైనే భరోసా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

|

Mar 29, 2023 | 7:05 AM

టార్గెట్‌ తెలుగు రాష్ట్రాలు. ఇదే ఇప్పుడు కమలం పార్టీ లైన్. రెండు రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలన్నది ప్లాన్. ఇందుకోసం ఏం చేయాలనే దానిపై ఫోకస్‌ పెట్టారు కమలనాథులు. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ప్రజలకు బీజేపీపైనే భరోసా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Pm Modi
Follow us on

టార్గెట్‌ తెలుగు రాష్ట్రాలు. ఇదే ఇప్పుడు కమలం పార్టీ లైన్. రెండు రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలన్నది ప్లాన్. ఇందుకోసం ఏం చేయాలనే దానిపై ఫోకస్‌ పెట్టారు కమలనాథులు. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ మూలమూలకు విస్తరిస్తోందన్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో చాలా ఏళ్ల నుంచి బలంగా ఉన్నాం. ఈనాటికీ అక్కడ నెంబర్ 1గా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది. ఏపీ ప్రజల్లో రోజురోజుకూ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది. తమిళనాడు, కేరళలో రోజురోజుకూ పార్టీ బలోపేతం అవుతోంది.. అంటూ ఢిల్లీ మీటింగ్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

2014 తర్వాత క్రమక్రమంగా నార్త్‌లో పాగా వేసిన కమలం పార్టీ.. ఇప్పుడు సౌత్‌పై స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. మిషన్‌ సౌత్‌ పేరుతో ఆ పార్టీ నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కర్నాటక మొదలు తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌ హెడ్‌క్వార్టర్స్ ఎక్స్‌టెన్షన్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోందంటూ కామెంట్ చేశారు.

దక్షిణ భారతదేశంలో సైతం బీజేపీ మూలమూలకూ విస్తరిస్తోందన్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో చాలా ఏళ్ల నుంచి బలంగా ఉన్నాం. ఇప్పటికీ అక్కడ నెంబర్ 1గా ఉన్నామంటూ మోదీ ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మీద మాత్రమే భరోసా ఉంది, ఏపీలోనూ ప్రజల్లో రోజురోజుకూ బీజేపీపై ఆదరణ పెరుగుతోందన్నారు మోదీ. తమిళనాడు, కేరళలో రోజురోజుకూ పార్టీ బలోపేతం అవుతోందంటూ ప్రకటించారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ నినాదాన్ని నిజం చేస్తూ సీట్ల సంఖ్య, ఓట్ల శాతంలో బీజేపీని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

ఇవి కూడా చదవండి

ఓ వైపు కర్నాటకలో ఎన్నికలు, త్వరలో తెలంగాణ ఎన్నికలు, ఆపై ఏపీలో ఎలక్షన్‌ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. దాన్ని పెంచుకుంటూ పోతూ, సీట్లు, ఓట్లు శాతం పెరిగేలా కసరత్తు చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ముఖ్యంగా సౌతిండియాలో పార్టీ బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలు వివరించారు. కర్నాటకలో మరోసారి అధికారం, తెలంగాణలో మిషన్‌ 90పై ఫోకస్‌ పెట్టింది బీజేపీ హైకమాండ్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..