AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi Speech: తెలంగాణలో మార్పు తథ్యం.. బీజేపీదే అధికారం: ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణను విచ్ఛన్నం చేసేవారు నాడు నేడూ ఉన్నారని మోడీ పేర్కొన్నారు. అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబం కోసం కాదని పేర్కొన్నారు.

PM Narendra Modi Speech: తెలంగాణలో మార్పు తథ్యం.. బీజేపీదే అధికారం: ప్రధాని నరేంద్ర మోడీ
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2022 | 2:07 PM

Share

PM Narendra Modi Speech: పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మరోపేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఎప్పుడొచ్చినా మీరు రుణం పెరిగిపోతుందని.. మీ ప్రేమాభిమానాలే బలం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ బేగంపేట విమనాశ్రయానికి చేరుకొని.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.  తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని మోడీ తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలంగాణను విచ్ఛన్నం చేసేవారు నాడు నేడూ ఉన్నారని పేర్కొన్నారు. అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబం కోసం కాదని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ త్యాగం చేశారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు సర్దార్ పేటల్ స్ఫూర్తితో ఉద్యమించాలని, ఆయన్ను అనుసరించాలని సూచించారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు. కుటుంబ పార్టీలుంటే అవినీతి పెరుగుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

తెలంగాణలో మార్పు తప్పనిసరిగా వస్తుందని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోడీ పేర్కొన్నారు. మా పోరాటం అభివృద్ధి కోసం అని.. పేర్కొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం.. జెండా ఎగురవేస్తామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి తప్పక జరుగుతుందని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తామని.. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ సూత్రంతో బీజేపీ పనిచేస్తోందన్నారు. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. రాష్ట్ర ఆకాంక్షలు అలానే ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. యువతతో కలిసి పోరాడుతామని.. తమ పోరాటం ఫలిస్తుందని మోడీ పేర్కొన్నారు. పథకాల పేర్లు మార్చి.. తెలంగాణ ప్రజల నుంచి తమ పేర్లను తొలగించలేరని మోడీ పేర్కొన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని మోడీ పేర్కొన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నామని.. ఈ 8 ఏళ్లల్లో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించామన్నారు. తనకు టెక్నాలజీ పైన అపారమైన నమ్మకం ఉందని తెలిపారు. తాను సాంకేతికతను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మనన్నారు. అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదన్నారు.  తాము పారిపోయే వాళ్లం కాదని, పోరాడే వాళ్లమని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లని మోడీ పేర్కొన్నారు.