Telangana: రేపు (శనివారం) భైంసా బంద్ కు పిలుపు.. అప్రమత్తమైన అధికారులు.. హై సెక్యూరిటీ విధింపు
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) అరెస్టును నిరసిస్తూ.. రేపు (శనివారం) భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బంద్ కు సంబంధింన ప్రచార చిత్రాలు వైరస్ అవుతుండటంతో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు..
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అరెస్టును నిరసిస్తూ.. రేపు (శనివారం) భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో బంద్ కు సంబంధింన ప్రచార చిత్రాలు వైరస్ అవుతుండటంతో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ టెన్షన్ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్ లతో తనిఖీలు చేస్తున్నారు. అంతే కాకండా పట్టణంలో పికెటింగ్ లు ఏర్పాటు చేశారు. కాగా.. గోషామహల్ (Gosha Mahal) ఎమ్మెల్యే రాజాసింగ్ ను గురువారం (నిన్న) ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. ఓ వర్గంపై వివాదాస్పద కామెంట్స్ చేశారంటూ భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పెట్టిన వీడియోపై ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అయితే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసిన కేసులో రాజా సింగ్‌పై కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టేలా పాట పాడారని షాహినాయత్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఆయనపై కంప్లైంట్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్టు అవడం హాట్‌టాపిక్ గా మారింది. అరెస్టుకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. మునావర్ ఫారుఖీ వల్లే హైదరాబాద్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీతారాములను తిట్టే వ్యక్తిని హైదరాబాద్‌కు తీసుకురావొద్దని సీఎం కేసీఆర్, కేటీఆర్, డీజీపీకి రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారని, షోకాజ్ నోటీసుకు 10 రోజుల్లో సమాధానం చెప్పాలని కోరింది. తక్షణమే రాజాసింగ్‌కు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు నిర్ణయించింది. ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో తెలిపింది. సోషల్ మీడియాలో రాజాసింగ్ పెట్టిన వీడియోపై మజ్లిస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్ రాజాసింగ్ వీడియోను తొలగించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..