Telangana: కూలీల కొరత వేధిస్తున్న వేళ రైతన్న అద్భుతం.. ఇలా చేస్తే రైతుల పంట పండినట్లే..

Telangana: ఆలోచించే తత్వం ఉండాలి కానీ, ఆవిష్కరణలకు పెద్దగా చదువు అక్కర్లేదు. ఇదే విషయాన్ని నిరూపించాడు ఓ గ్రామీణ రైతు. తనకు మాత్రమే కాకుండా..

Telangana: కూలీల కొరత వేధిస్తున్న వేళ రైతన్న అద్భుతం.. ఇలా చేస్తే రైతుల పంట పండినట్లే..
Pumpset
Follow us

|

Updated on: Aug 26, 2022 | 2:26 PM

Telangana: ఆలోచించే తత్వం ఉండాలి కానీ, ఆవిష్కరణలకు పెద్దగా చదువు అక్కర్లేదు. ఇదే విషయాన్ని నిరూపించాడు ఓ గ్రామీణ రైతు. తనకు మాత్రమే కాకుండా, యావత్ రైతాంగానికి ఉపయోగపడే అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఆ రైతు. వ్యవసాయ సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చును తగ్గించే క్రమంలో అతను తయారు చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. అవును, ఓ రైతు తన సొంత ఆలోచనతో పత్తి, వరి పొలాలకు పిచికారి కోసం ఓ యంత్రాన్ని తయారు చేశాడు. కూలీల కొరత అధిగమించడంతో పాటు ఖర్చును, సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఎద్దుల బండిపై మిషన్ తయారు చేసి తక్కువ సమాయంతో ఎక్కువ పని జరిగేలా చేశాడు.

వివరాల్లోకెళితే.. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వల గ్రామంలో ఆంజనేయులు అనే రైతు తన పొలానికి మందులు పిచికారి చేయడానికి కూలీలు దొరక్క నానా అవస్థలు పడ్డాడు. ఒక వేళ కూలీలు దొరికినా పిచికారి కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఓ ఉపాయాన్ని అమలు చేశాడు. తన వద్ద ఉన్న ఎద్దుల బండికి రెండు డ్రమ్ములు బిగించి మోటర్ పంపు స్ప్రే పంపు బిగించాడు. స్ప్రే కోసం డ్రమ్ములో నీటిని నింపుకోవడానికి ఎలాంటి పనివారు అవసరం లేకుండా పైపు సహాయంతో డ్రమ్ము నింపుకునేలా అమర్చాడు. ఆ డ్రమ్ములో పురుగుల మందు కలుపుకుని పిచికారి చేస్తున్నాడు. కూలీల అవసరం లేకుండా ఒక్కడే పిచికారి చేస్తూ ఔరా అనించాడు. గంటకు నాలుగు ఎకరాలు మందు పిచికారి చేయవచ్చు అని అంటున్నారు రైతు ఆంజనేయులు. ఈ ఎద్దుల బండితో పిచికారి వల్ల ఏపుగా పెరిగిన మొక్కకు పూత గాని, పిందెలు గానీ రాలడం లేదంటున్నాడు. రైతులు ఇలాంటి మిషన్ తయారు చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చు అవుతుందని, ఈ మిషన్ తో పిచికారీ చేస్తే సమయం కూడా అదా అవుతుందని రైతు ఆంజనేయులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..