OU Ladies hostel: ‘పురుగుల అన్నం పెడుతున్నారు..’ ఓయూ హాస్టల్ ముందు విద్యార్థినుల ధర్నా
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్‌ను తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు..
హైదరాబాద్, జనవరి 9: ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్‌ను తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఓ విద్యార్ధిని మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి లేడిస్ హాస్టల్‌లో ఉంటున్నానని, వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిపారు. మూడు, నాలుగు సార్లు పాలిష్ చేసిన బియ్యం వినియోగిస్తున్నారని, తమ సమస్యల గురించి అధికారులకు విన్నవిస్తే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ర్యాంకులు కొట్టి అడ్మిషన్ పొందితే తమ సమస్యలు కనీసం పట్టించుకునే నాదుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ వార్డెన్‌ను కలిసి తమ సమస్యల గురించి చెప్పినా.. కనీసం ఒక్కసారైనా వచ్చి పరిశీలించలేదన్నారు. వెజిటబుల్స్‌లో పురుగులు వస్తున్నాయని చెబితే.. వాటిని తీసివేసి తినాలని చెబుతున్నారని తెలిపారు. 20 నుంచి 30 మంది విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఇక్కడికి వచ్చింది ఆరోగ్య సమస్యలతో మా సమయం వృధా చేసుకోవడానికా.. మేము చదువుకోవద్దా అని ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు చీఫ్ వార్డెన్ పేరు ఏమిటో కూడా మాకు తెలియదు. మా సమస్యలను పరిష్కరించి, మాకు మంచి ఆహారం అందించే అధికారులు కావాలంటూ విద్యార్ధినులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.