
Electric poles in middle of road: నవ్వి పోదురుకాక మాకేంటి సిగ్గు అన్నట్లు వ్యవహరించిన ఆ అధికారుల తీరు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోటు కాంట్రాక్టర్ల అసమర్థత.. నిర్లక్ష్యం.. భూపాలపల్లి మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారింది. నడి రోడ్డుపై విద్యుత్ స్తంభాలు వదిలేసి కాంట్రాక్టర్ రోడ్డు నిర్మిస్తే.. అక్కడే ఉండి కళ్ళప్పగించి చూసిన అధికారుల అసమర్థతపై జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రోడ్డు వేసి.. నిత్య ప్రమాదాలకు కారకులైన అధికారులు, కాంట్రాక్టర్ పై స్థానికులు మండి పడుతున్నారు.
ఈ విచిత్ర రోడ్డు నిర్మాణం భూపాలపల్లి మున్సిపాలిటీలో జరిగింది. జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుండి ఖాసీంపల్లి వరకు నుతనంగా నిర్మించారు.. ప్రస్తుతం ఈ రహదారి ప్రమాదకరంగా తయారైంది.. రహదారిపై అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించకుండ రోడ్డు పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం పది కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు. గణేష్ చౌక్ నుండి ఖాసీంపల్లి వరకు రహదారి విస్తరణ, సెంటర్ లైటింగ్ నిర్మాణం చేపట్టారు..అంతా బాగానే వుంది.. కానీ ఇప్పుడు నిత్యప్రమాదాలకు కారణమైన అసమర్థత.. అధికారులు, కాట్రాక్టర్ ను నవ్వుల పాలు చేస్తుంది.
రహదారిపై అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.. రహదారి మధ్యలో విద్యుత్ స్తంభాలు అడ్డుగా మారడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. అటుగా వెళ్లే వాహనదారులు అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు విద్యుత్ స్థంబానికి ఢీకొని మృత్యువాత పడ్డాడు. రహదారిపై అడ్డుగా ఉన్న స్థంబాలను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..