AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!

మత్తుకు బానిసలు అవుతున్న పోకిరిలు ఉన్మాదులుగా మారుతున్నారు. అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు. అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. కొందరు కిరాతకులు సోషల్ మీడియా స్టార్స్ కావాలనే పాపపు ఆలోచనతో అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వ్యూస్ కోసం ఓ వ్యక్తిని బండరాళ్లతో విచక్షణారహితంగా కొడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఘటన ఓరుగల్లులో కలకలం రేపింది .

ఓ వ్యక్తిని బండరాళ్లతో కొట్టుకుంటూ.. వీడియోలు షూట్ చేసిన మానవ మృగాలు..!
Ganja Gang Films Bludgeoning
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 12, 2026 | 4:16 PM

Share

మత్తుకు బానిసలు అవుతున్న పోకిరిలు ఉన్మాదులుగా మారుతున్నారు. అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు. అమాయకులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. కొందరు కిరాతకులు సోషల్ మీడియా స్టార్స్ కావాలనే పాపపు ఆలోచనతో అమాయక ప్రజలపై ప్రతాపం చూపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా వ్యూస్ కోసం ఓ వ్యక్తిని బండరాళ్లతో విచక్షణారహితంగా కొడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఘటన ఓరుగల్లులో కలకలం రేపింది .అసలేం జరుగుతుంది..! పోలీసులు నిద్రవస్తలో ఉన్నారా..? లేక గంజాయి బ్యాచ్ యాక్టివ్ అయ్యారా..? అక్కడే ఎందుకు వరుస ఘటనలు జరుగుతున్నాయి తెలుసుకుందాం..

గంజాయి బ్యాచ్ తో వరంగల్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఎవరిపై దాడి చేస్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతున్నారు. అర్ధరాత్రి అయింది అంటే యువత గంజాయి మత్తులో ఎవరిపై దాడికి పాల్పడతారో తెలియని పరిస్థితి. తాజాగా వరంగల్‌లోని ఎల్బీనగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనే అందుకు నిదర్శనం. ఇదే ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తి రాత్రి పని నిమిత్తం గాంధీనగర్ కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు యువకులు గంజాయి మత్తులో సురేష్‌ను నడి రోడ్డుపై ఆపారు. అతన్ని విచక్షణారహితంగా బండరాయితో కొట్టుకుంటూ అదంతా వీడియో షూట్ చేశారు.

నడి రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. బండరాళ్లతో దాడిచేసి విచక్షణా రహితంగా పిడిగుద్దులు గుద్దాడు. తీవ్రంగా గాయపరిచారు. కాళ్లతో తన్నుకుంటూ వీడియోలు చిత్రీకరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న సురేష్ ను ఉదయం పారిశుద్ధ్య కార్మికులు గమనించి ఇంటికి చేర్చారు. అక్కడి నుండి MGM ఆస్పత్రికి తరలించారు. మృత్యుంజయుడు అయిన సురేష్ కాళ్ళు విరిగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఉన్మాదులు ఎందుకు అలా కొట్టారో..! ఎవరు కొట్టారో అర్థం కావడం లేదు..! సోషల్ మీడియాలో రీల్స్ చూసిన తర్వాత ఆ ఉన్మాదాలు ఎవరనేది తెలిసింది. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు

ఇదొక్కటే కాదు.. వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి.. రాత్రివేళ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనం హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఐదు సంఘటనలు జరిగాయి. రాత్రి అయిందంటే పాన్ షాప్ కాడ నో లేదా మద్యం షాప్ వద్ద నో గంజాయి బ్యాచ్ ఎవరిని ఎందుకు కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి. పదిహేను రోజుల క్రితం గవిచర్ల క్రాస్ వద్ద నలుగురు యువకులు వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేశారు. నడిరోడ్డు పై బైక్ ఆపి బీర్ బాటిల్ తో దాడి చేశారు. మరొక ఘటన.. గతంలో అగ్గిపెట్ట కోసం గొడవపడ్డ ఇద్దరు యువకులు మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఇటీవల ఖిలా వరంగల్‌లోని పడమరకోటలో మద్య మత్తులో ఇద్దరు యువకులు స్వీట్ హౌస్ పై దాడికి పాల్పడి బీభత్స సృష్టించారు. రెండు రోజుల క్రితం శంభునిపేట ప్రాంతంలోని వైన్ షాప్ వద్ద మద్యంమత్తులో కొంతమంది యువకులు హంగామా చేశారు. అత్యంత దారుణంగా దాడులకు బరితగించిన పోకిరీలు అక్కడ వాహనాలతో బీభత్సం సృష్టించారు. దుకాణాలపై దాడి చేశారు. అడ్డొచ్చిన వారిపై ప్రతాపం చూపారు. ఈ దాడి దృశ్యాలని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

అసలు ఓరుగల్లు నగరంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఫల్యమే కారణమనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దాడులన్నీ సీసీ ఫుటేజ్ చూశాకే పలానా వ్యక్తులు దాడి చేశారని నిర్ధారణకు రావలసిన పరిస్థితి పోలీసులకు దాపురించింది. ఖాకీలు తగిన చర్యలు తీసుకోకపోతే గంజాయి బ్యాచ్ దాడులు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

మరిన్ని క్రైమ్ వార్తల కోసంవ ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us