AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. ఇదిగో వీడియో

హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. టూ వీలర్‌ను ఢీకొట్టిన కారు డ్రైవర్, ఓ వ్యక్తిని కారు బానెట్‌పై సుమారు 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. స్థానికులు అడ్డుకోవడంతో వదిలేసి పారిపోయాడు. ఈ ఘటనలో జిలానీ కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Hyderabad: దారుణం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. ఇదిగో వీడియో
Car Accident
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2026 | 8:28 AM

Share

హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఓ కారు.. టూ వీలర్‌ను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. అడ్డుకున్న బాధితుడిని కారు బానెట్‌పై రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్‌. ఆ తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో బాధితుడిని వదిలేశాడు. గాయత్రి నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి ఎస్‌కే జిలానీ, అతని కొడుకు ఫైసల్‌ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కారులో ఉన్న వ్యక్తి ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేశాడు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో తండ్రి ఎస్‌కే జిలానీ కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనం ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. జిలానీ కార్ బానెట్‌పై ఉండగానే సుమారు రెండు కిలోమీటర్ల మేర లాగుతూ తీసుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. కారు బాలాపూర్ చౌరస్తా వరకు వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి మందమల్లమ్మ చౌరస్తా వద్దకు వచ్చాక అక్కడ ప్రయాణికులు అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు.

వీడియో చూడండి..

ఈ ప్రమాదంలో కొడుకు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి
ప్లేఆఫ్ చేరాలంటే.. ఈ ఐదుగురిని బెంచ్‌కే ఫిక్స్ చేయండి
దారుణం.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
దారుణం.. కారు బానెట్‌పై 2 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఆయన నాకు సొంత అన్నలాంటి వారు.. ఆ టాలీవుడ్ హీరోపై సత్య ప్రశంసలు
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. చనిపోయినా ఇండస్ట్రీని నుంచి ఎవరు వెళ్
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గిందో తెలుసా..?
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
ఇలా చేస్తే.. జస్ట్10 నిమిషాల్లోనే దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
సినిమా స్టైల్‌లో దోపిడీ.. ఒక్క క్లూ లేకున్నా పోలీసులు కేసు ఎలా..
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
వికెట్లకు కాకుండా బ్యాటర్ తలకు బంతి గురి పెట్టిన బౌలర్
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
కేంద్రం పంపిన అలర్ట్ మెస్సేజ్ రాలేదా..? ఈ సెట్టింగ్ ఆన్ చేస్కోండి
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?