AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం.. అమ్మమ్మల నాటి సీక్రెట్స్..

ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే చాలు ఎండ తీవ్రత, చెమట వల్ల ముఖం జిడ్డుగా మారి కాంతిని కోల్పోతుంది. దీనికి తోడు టానింగ్ సమస్య సరేసరి. ముఖాన్ని తిరిగి తాజాగా మార్చుకోవడానికి పార్లర్‌కు వెళ్లాలంటే సమయం, డబ్బు రెండూ ఖర్చే.. కానీ మన వంటింట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో కేవలం 10 రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే ఇన్‌స్టంట్ గ్లో పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 03, 2026 | 7:24 AM

Share
బంగాళదుంపతో సహజ బ్లీచ్: బంగాళదుంప కేవలం కూరలకే కాదు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. బంగాళదుంప రసాన్ని నేరుగా ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. బియ్యప్పిండి, బంగాళదుంప రసం, కలబంద గుజ్జు, టమాటా రసం కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత వృత్తాకారంలో మసాజ్ చేస్తూ కడిగేస్తే ముఖం తక్షణమే ప్రకాశవంతంగా మారుతుంది.

1 / 5
నారింజ, నిమ్మ తొక్కల మ్యాజిక్: నారింజ, నిమ్మ పండ్లు తిన్న తర్వాత మనం సాధారణంగా వాటి తొక్కలను పారేస్తాం. కానీ వాటిలోనే చర్మానికి అవసరమైన విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా ముడతలను తగ్గిస్తుంది. తాజా నారింజ లేదా నిమ్మ తొక్కలను తురిమి మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. దీనికి ఒక విటమిన్ ఇ క్యాప్సూల్, కొద్దిగా కలబంద గుజ్జును జోడించండి. ఈ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు వాడటం వల్ల చర్మంపై ఉన్న టానింగ్ తగ్గి, చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా మారుతుంది.

2 / 5
మృతకణాల తొలగింపునకు ఓట్స్: ముఖం నిర్జీవంగా కనిపిస్తోందంటే దానికి కారణం పేరుకుపోయిన మృతకణాలు. వీటిని తొలగించడానికి ఓట్స్ అద్భుతమైన స్క్రబ్‌లా పనిచేస్తాయి. ఓట్స్ పౌడర్‌లో తేనె, పాలు లేదా పెరుగు కలిపి ముఖానికి పట్టించండి. కొన్ని నిమిషాల తర్వాత సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడిగేయండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ముఖానికి మంచి ఛాయను ఇస్తుంది.

3 / 5
టమాటా:  వేసవిలో చేతులు, పాదాలు, ముఖం ఎండ దెబ్బకు నల్లగా మారిపోతుంటాయి. ఈ సమస్యకు టమాటా ఒక రామబాణంలా పనిచేస్తుంది. టమాటాలోని లైకోపిన్ చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది. ఒక టమాటాను సగానికి కోసి, దానిపై కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు చల్లండి. దీనితో ముఖంపై మరియు నల్లబడిన ప్రాంతాల్లో 5-10 నిమిషాల పాటు మర్దన చేయండి. ఇది చర్మంపై ఉన్న నలుపును తక్షణమే తొలగించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల సన్ ట్యాన్ సమస్య ఉండదు.

4 / 5
పురాతన పద్ధతి: మన అమ్మమ్మలు, నానమ్మలు పాటించే ఈ చిట్కా వెనుక శాస్త్రీయ కారణం ఉంది. పెరుగు చర్మానికి తేమను అందిస్తే, పసుపులోని యాంటీ సెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు స్వచ్ఛమైన పసుపును పెరుగులో కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్‌తో సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయండి. మార్కెట్లో దొరికే వంట పసుపు కంటే పచ్చి పసుపు కొమ్ములు తెచ్చి వాడటం వల్ల చర్మంపై ఎరుపు రంగు పడకుండా ఉంటుంది.

5 / 5
Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..

48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.

పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?

నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..

వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ

తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్

ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..

రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?