Jobs in Singareni : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల‌

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సింగరేణి సంస్థ. ఈ ఏడాది తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 651 ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల...

Jobs in Singareni : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల‌
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 22, 2021 | 6:06 AM

Jobs in Singareni : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సింగరేణి సంస్థ. ఈ ఏడాది తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 651 ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల సింగరేణి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. తొలి విడత 372 ట్రైనీ ఉద్యోగాలకు ఆ సంస్థ నోటిఫికేషన్‌ జారీచేసింది.

128 ఫిట్టర్‌, 51 ఎలక్ట్రీషియన్‌, 54 వెల్డర్‌, 22 టర్నర్‌..మెషినిస్టు, 14 మోటారు మెకానిక్‌, 19 ఫౌండ్రీమెన్‌/మౌల్డర్‌, 84 జూనియర్‌ స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. వీటిలో స్థానిక రిజర్వేషన్‌ కింద 305 పోస్టులను ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.

మిగిలిన వాటిని తెలంగాణ వారందరికీ (అన్‌ రిజర్వుడు) వర్తింపజేస్తారు. స్థానిక రిజర్వేషన్‌ కింద భర్తీ చేయనున్న వాటిలో 105 ఫిట్టర్‌, 43 ఎలక్ట్రీషియన్‌, 44 వెల్డర్‌, 18 టర్నర్‌/మెషినిస్టు 18, 16 ఫౌండ్రీమెన్‌/మౌల్డర్‌, 67 స్టాఫ్‌ నర్సు, 12 మోటారు మెకానిక్‌ పోస్టులున్నాయి. అభ్యర్థులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు www.scclmines.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4 తుది గడువు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్‌ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చివరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆ సంస్థ జీఎం (పర్సనల్‌) ఆనందరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.