Telangana: గత అనుభవాలు మర్చిపోకండి.. మాస్క్ పెట్టుకోండి.. ఇది ప్రభుత్వ సూచన కూడా
కరోనా మరోసారి భయపెడుతోంది. రెండేళ్ల నుంచి వివిధ రూపాల్లో ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోసారి ప్రపంచం లోనీ కొన్ని దేశాలు కరోనాతో అల్లాడుతున్న నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయింది..ఇప్పటికే జాగ్రత ల విషయం లో పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వలకు లేఖలు రాసింది.ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది.

ప్రీవియస్ ఫేజ్‌లలో… కరోనా సృష్టించిన విలయతాండవాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్టయ్యాయి. ఢిల్లీ లెవల్లో… ప్రధాని నరేంద్ర మోదీ… హై లెవల్ మీటింగ్ నిర్వహించి.. రాష్ట్రాలకు తగు సూచనలు జారీ చేశారు. ఇటు రాష్ట్రంలోనూ వైద్యమంత్రి హరీష్‌రావు… ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మాస్క్ మస్ట్ అంటూనే… వ్యాక్సినేషన్ పై కూడా ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్స్ లు సిసిఎంబి, సిడిఎఫ్ డి, గాంధీ మెడికల్ కాలేజీలలో జరుగుతున్నాయి. అయితే, కొన్నాళ్లుగా కరోనా కేసులు తగ్గడంతో.. గాంధీ మెడికల్ కాలేజ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో మాత్రమే జీనోమ్ సీక్వెన్సులు చేస్తున్నారు. రెండునెలలుగా జరిగిన టెస్టుల్లో … ఎక్స్ బిబి సబ్ వేరియంట్‌ను మాత్రమే ఎక్కువగా గుర్తించిన వైద్యులు… అప్పుడప్పుడు బిఎఫ్ 1, బిఎఫ్ 3, బిఎఫ్ 4, బిఎఫ్6 సబ్ వేరియంట్లూ కనిపించాయంటున్నారు. అయితే.. పాజిటివ్ కేసులు తక్కువగా రావడంతో.. జీనోమ్ సీక్వెన్స్ లో ఎక్కువగా శాంపిల్స్ రావడం లేదట.
సెకండ్ వేవ్ టైమ్‌లో చేసిన ఏర్పాట్లతో.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్లో ఉందని చెబుతున్నారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి బిఎఫ్ 7తో ఎలాంటి ప్రమాదం లేదనీ.. తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. లేదంటే ప్రమాదం బారిన పడక తప్పదంటున్నారు. మొన్నటిదాకా రిలాక్సుడుగా ఉన్న జనాలు సైతం… మరో వేవ్ పొంచి ఉందన్న ప్రమాదంతో… టెస్టులకు ఎగబడుతున్నారు. వ్యాక్సినేషన్‌కు సైతం అదేస్థాయిలో.. ముందుకొస్తున్నారు. గతంలో, వ్యాక్సినేషన్ కోసం వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చినా పట్టించుకోనివాళ్లు సైతం… ఇప్పుడిలా ముందువరుసలో ఉంటున్నారు. మాస్క్ మ్యాండేటరీ అయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. మళ్లీ మెల్లమెల్లగా మొహాలను కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జనం.
వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పుడు బలంగా వినిపిస్తున్న పేరు కోర్బీ వ్యాక్స్. హైదరాబాద్ బైలాజికల్ సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్… ఇప్పుడు 250 రూపాయలకే అందుబాటులో ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి లభించింది కాబట్టి… సర్కార్ కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. సో.. జనాలు భయపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. కోవీషీల్డ్ వేయించుకున్న వారికి.. యాంటీ బాడీస్ మరింత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తమ పరిశోధనలో తేలిందంటున్నారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. దీనిపై ఒక పరిశోధన పత్రాన్ని కూడా రూపొందించినట్టు చెప్పారు.
కరోనా కేసులు ఉన్నా లేకున్నా.. వైరస్ ఉన్నట్లే భావించి నిబంధనలు పాటిస్తే… ఇంకెన్ని వేవ్‌లు వచ్చినా భయం లేదంటున్న వైద్యనిపుణులు. అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం.. ఆపదను కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. సో. బీ కేర్ ఫుల్.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
