Nims Hospital: వావ్ సూపర్.. నాలుగు నెలల్లోనే అరుదైన రికార్డు సాధించిన నిమ్స్

|

May 01, 2023 | 6:24 PM

ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఈ ఘనతను నిమ్స్ వైద్యులు సాకారం చేశారు.

Nims Hospital: వావ్ సూపర్.. నాలుగు నెలల్లోనే అరుదైన రికార్డు సాధించిన నిమ్స్
Nims
Follow us on

ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఈ ఘనతను నిమ్స్ వైద్యులు సాకారం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభుత్వ సహకారంతో రోగికి రూ.15 లక్షల విలువైన ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తోంది. నిమ్స్ తో పాటు గాంధీ, ఉస్మానియాల్లో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాల మార్పిడి సర్జరీలను ప్రభుత్వం అరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నారు.

2014 నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు (522 లైవ్, 340 కాడవర్ కేసులు) జరిగినట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి, ప్రతి సంవత్సరం సగటున 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని. గత ఏడాది 2022లో 93 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు (28 లైవ్, 22 కాడవర్ కేసులు) విజయవంతంగా పూర్తైనట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌ధన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో చేస్తున్నామని వివరించారు. నిమ్స్ యూరాలజీ వైద్యులు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లతో పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర యూరాలజీ శస్త్రచికిత్సలను కూడా చేస్తున్నారని తెలిపారు.

ఆర్గాన్ డొనేషన్స్‎లో తెలంగాణ టాప్

ఇవి కూడా చదవండి

4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసిన నిమ్స్ వైద్యలను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని తెలిపారు. అత్యంత ఖరీదైన వైద్యం పేదలకు చేరువయ్యిందని, తద్వారా అనేక మంది అవయవ మార్పిడి బాధితులకు పునర్జన్మ లభిస్తుందని కొనియాడారు. గాంధీ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఇది పూర్తయితే సేవలు మరింత విస్తృతం అవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం