NIMS: గుండె, ఊపిరితిత్తుల మధ్య కిడ్నీ.. స్కాన్ చేసి చూస్తే అవాక్కైన డాక్టర్లు.. చివరికి
సాధారణంగా కిడ్నీలు నడుము వెనుక భాగంలో ఉంటాయి. కానీ ఓ యువకుడికి మాత్రం వింత సమస్య ఎదురైంది. అతడి శరీరంలో కిడ్నీ ఉండాల్సిన చోట లేదు. గుండెకు, ఊపిరితిత్తులకు మద్య ఉంది. ఇదే విశేషమనుకుంటే....
సాధారణంగా కిడ్నీలు నడుము వెనుక భాగంలో ఉంటాయి. కానీ ఓ యువకుడికి మాత్రం వింత సమస్య ఎదురైంది. అతడి శరీరంలో కిడ్నీ ఉండాల్సిన చోట లేదు. గుండెకు, ఊపిరితిత్తులకు మద్య ఉంది. ఇదే విశేషమనుకుంటే ఆ ఆ కిడ్నీలోనూ రాళ్లుండటం మరింత విస్మయం కలిగించింది. ఇంత క్లిష్టమైన చికిత్స కావడంతో ఈ కేసును ప్రైవేటు ఆస్పత్రులు టేకప్ చేయలేదు. కానీ నిమ్స్ యూరాలజీ విభాగం దీన్నో సవాల్‌గా స్వీకరించింది. బాధితుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అరుదైన రికార్డు నెలకొల్పింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మూత్రంలో మంట, జ్వరం, నడుము నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అతడి శరీరంలో ఎడమ మూత్రపిండం ఉండాల్సిన స్థానంలో లేదని.. అది ఛాతీ భాగంలో ఉందని గుర్తించారు. అంతే కాకుండా ఆ కిడ్నీలో రాళ్లు ఉండటాన్నీ గమనించారు. మూడేళ్ల క్రితం మూత్రపిండం నుంచి మూత్రాశయానికి వెళ్లే నాళంలో రాళ్లు ఏర్పడితే వాటిని తొలగించే క్రమంలో వైద్యులు స్టంట్ వేశారని బాధితుడు తెలిపాడు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడు.
గతంలో స్టెంట్ వేసిన దానిని తొలగించకుండా ఉన్న స్టెంట్ ఎడమవైపు కిడ్నీ పై భాగంలో విరిగిపోయింది. ఆ ప్రాంతంలో రాళ్లు ఏర్పడ్డాయి. వాటిని తొలగించడానికి సింగిల్ లంగ్ వెంటిలేషన్ ద్వారా వ్యాట్స్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. కిడ్నీవైపు ఉన్న ఎడమ ఊపిరితిత్తిని తాత్కాలికంగా పనిచేయకుండా నిలిపివేశారు. ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఒక రంధ్రం చేసి ఎడమ కిడ్నీలో ఉన్న రాయిని, అలాగే స్టెంట్‌ను తొలగించారు. ఇందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. ఛాతీ భాగంలో కిడ్నీ ఉండటం అత్యంత అరుదైన విషయం. నిమ్స్‌లో ఈ తరహా కేసు చూడటం ఇదే మొదటిసారి అని వైద్యులు చెప్పారు. ఈ సమస్యకు చికిత్సను సవాల్ గా తీసుకున్నామన్న డాక్టర్లు.. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..