Telangana: త్వరలో ట్రాన్స్‌జెండర్లకు కొత్త బాధ్యతలు.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రయోగం..!
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది.
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను సులభతరం చేయడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు హాట్ టాపిక్ గా ఇంట్రెస్టింగ్ గా మారింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని వాలంటీర్లుగా వినియోగించేందుకు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ ఆలోచన ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారికి సమాజంలో గౌరవం తీసుకురావడమే కాకుండా, నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కూడా ఒక కొత్త మార్గం చూపించినట్లు అవుతుందని భావిస్తున్నారు సీఎం రేవంత్. హోమ్ గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను సీఎం సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, శుభ్రత, ఇతర కీలక పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా, టెండర్ల ద్వారా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల పనితీరుపై ఆయన నిశితంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఏమాత్రం ఉపేక్షించరాదని సీఎం ఆదేశించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్ల అభివృద్ధి, ఫుట్ పాత్ నిర్మాణాలు, ఇతర పనులను గడువులోపు పూర్తిచేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై పూర్తి స్థాయి నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
తప్పుడు నివేదికలు సమర్పించిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు జరుగుతుండగా, అవి సమయానికి పూర్తవ్వడం కోసం తగిన క్రమశిక్షణతో పని చేయాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు. ఇక ఇదే సమావేశంలో ముఖ్యమంత్రి ట్రాఫిక్ స్ట్రీమ్‌లైన్ చేయడంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని వాలంటీర్లుగా వినియోగించేందుకు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని సీఎం అభిప్రాయపడ్డారు.
ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హోమ్ గార్డ్స్ తరహా ఉద్యోగాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఆసక్తి ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించి, తగిన విధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి సూచించిన ఈ కొత్త ఆలోచన ఒకవైపు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సమాన అవకాశాలు కల్పిస్తుండగా, మరోవైపు నగర ట్రాఫిక్ సమస్యలపై ఒక పరిష్కార మార్గాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..