Telangana: బుజ్జి కుక్కలకు ఘనంగా బారసాల.. బంధుమిత్రుల సమక్షంలో ఫంక్షన్ ఏర్పాటు..
బెలూన్స్ తో అందంగా అలంకరించిన కాలనీవాసులు ఆ కుక్కకు బారసాల ఏర్పాటు చేశారు. ఈ శునకం చిన్నప్పటి నుంచి తమ కాలనీలోనే ఉంటుందని, అందరి ఇళ్లలో తిరుగుతూ ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సైతం ఈ కాలనీ వాసులను అభినందించారు. వీధి కుక్కపట్ల కాలనీ వాసులు చూపించిన ఆదరణకు అందరూ ప్రశంసలు కురిపించారు.
నల్లగొండ, డిసెంబర్08; ఇటీవల కాలంలో ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడం ఫ్యాషన్ గా మారింది. పెంపుడు జంతువులు పిల్లి,కోళ్లు, డాగ్స్ కు బర్త్ డే వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలు చేయడం చూశాం.. విన్నాం..కూడా. కానీ ఓ గ్రామస్తులు మాత్రం అందరికీ భిన్నంగా వీధి శునకాలకు బారసాలను నిర్వహించారు. అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం అక్కెనపల్లిలో కూడా ఇతర గ్రామాల్లో మాదిరిగా వీధి శునకాలు ఉన్నాయి. గ్రామంలోని ఓ కాలనీలో ఉండే వీధి శునకం చిన్నప్పటి నుంచి అందరి ఇళ్లలో తిరుగుతూ అందరితో ప్రేమగా పెంపుడు జంతువు మాదిరిగా ఉండేది. అయితే ఈ వీధి శునకం 21 రోజుల క్రితం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
కాలనీకి తోడునీడగా ఉండే శునకం నాలుగు పిల్లలకి కలర్ ఫుల్ గా బారసాల నిర్వహించారు. బెలూన్స్ తో అందంగా అలంకరించిన కాలనీవాసులు ఆ కుక్కకు బారసాల ఏర్పాటు చేశారు. ఈ శునకం చిన్నప్పటి నుంచి తమ కాలనీలోనే ఉంటుందని, అందరి ఇళ్లలో తిరుగుతూ ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు సైతం ఈ కాలనీ వాసులను అభినందించారు. వీధి కుక్కపట్ల కాలనీ వాసులు చూపించిన ఆదరణకు అందరూ ప్రశంసలు కురిపించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..