AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎద్దుల బండిపై ఊరేగిన వరుడు.. వధువు సైతం సంతోషంగా…ఎందుకో తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..

పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిలో తీసుకెళ్లాలనేది అతని దివంగత అమ్మమ్మ కోరిక అని తెలిసింది. తన కుటుంబంలోని పిల్లలలో ఒకరి పెళ్లి ఊరేగింపు ఎద్దుల బండిపై నిర్వహించాలని చెప్పారట. దాంతో వారి అమ్మమ్మ కోరిక మేరకు వరుడు ఇలా తన పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిపై ఏర్పాటు చేసుకున్నాడు. తనకు మద్దతుగా వధువు కూడా ఎద్దుల బండిపై తన అత్తమామల ఇంటికి వచ్చింది.

ఎద్దుల బండిపై ఊరేగిన వరుడు.. వధువు సైతం సంతోషంగా...ఎందుకో తెలిస్తే హాట్సాఫ్ అనాల్సిందే..
Bullock Cart
Jyothi Gadda
|

Updated on: Dec 08, 2023 | 2:20 PM

Share

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అద్వితీయమైన ఊరేగింపు జరిగింది. ఇక్కడ ఓ వరుడు వధువును తీసుకెళ్లేందుకు గుర్రం బగ్గీలు, కారుకు బదులుగా ఎద్దుల బండిపై వెళ్లాడు. పెళ్లికూతురు కూడా సంతోషంగా ఎద్దుల బండిపై అత్తమామల ఇంటికి వెళ్లటం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు ఈ అపూర్వ కళ్యాణోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో ప్రజలు కూడా ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశంగా మారింది. గ్వాలియర్‌లో ఈ ఊరేగింపు ప్రారంభమైన వెంటనే, ప్రజలు దీనిని చూడటానికి ఎగబడుతున్నారు. ఈ ఊరేగింపు వీడియో, ఫోటోను ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ మార్చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వైరల్‌గా మారడం మొదలైంది. ఖరీదైన వాహనాల్లో వెళ్లే వారు కూడా ఈ దృశ్యాన్ని అలా చూస్తుండిపోయారు.

నివేదిక ప్రకారం..పెళ్లికి సంబంధించి ఇలాంటి వింత ఊరేగింపు నగరంలోని ఖిలా గేట్ కూడలికి బయలుదేరింది. పెళ్లి ఊరేగింపుకు 10 ఎద్దుల బండ్లను ఏర్పాటు చేశారు. ఈ 10 ఎద్దుల బండ్లను ఇంటి బంధువుల కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పెళ్లి ఊరేగింపు ఎద్దుల బండిపై తీస్తున్న వీడియోలను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అందులో వృద్ధులే కాకుండా పిల్లలు కూడా కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిలో తీసుకెళ్లాలనేది అతని దివంగత అమ్మమ్మ కోరిక అని తెలిసింది. తన కుటుంబంలోని పిల్లలలో ఒకరి పెళ్లి ఊరేగింపు ఎద్దుల బండిపై నిర్వహించాలని చెప్పారట. దాంతో వారి అమ్మమ్మ కోరిక మేరకు వరుడు ఇలా తన పెళ్లి ఊరేగింపును ఎద్దుల బండిపై ఏర్పాటు చేసుకున్నాడు. తనకు మద్దతుగా వధువు కూడా ఎద్దుల బండిపై తన అత్తమామల ఇంటికి వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే