AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. ఏనేగుట్టలో అద్భుతం.. సంగీత స్వరాలు పలుకుతున్న రాళ్లు..

సంగీతానికి రాళ్లు కరుగుతాయని పురాణ కథల్లో విన్నాం.. రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడి రాళ్లు మాత్రం సంగీతాన్ని పలికిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో కోయిల రాగాలు, నెమలి నాట్యాలు, జింకల గెంతులు ఎంత సహజమో.. ఈ సప్తరాగాల రాళ్లు కూడా అంతే సహజం. లయబద్ధంగా తాకితే మరింత రాగాలు పలుకుతూ.. సందడి చేస్తున్నాయి.. రాగాలు పలికే రాళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

అబ్బ.. ఏనేగుట్టలో అద్భుతం.. సంగీత స్వరాలు పలుకుతున్న రాళ్లు..
Musical Stones
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 29, 2025 | 11:53 AM

Share

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటి పాముల గ్రామంలో నేషనల్ హైవే 65కు ఆనుకుని కూతవేటు దూరంలోని ఏనేగుట్ట ఉంది. ఈ గుట్టపై రాళ్ళ గుండ్లు ఉన్నాయి. గుండ్లను మరో రాయితే కొడితే కంచులా శబ్ధం వినిపిస్తోంది. ఈ రాళ్లను తాకితే ఒక్కోచోట ఒక్కో రకమైన సౌండ్‌ వస్తుంది. వడగండ్ల వాన పడ్డ సమయంలో ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో అబ్బుర పరుస్తాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ధ్వని తరంగాలు మనసును పులకరింప చేస్తాయి. ఈ రాళ్లను రాపిడిచేస్తే చక్కటి వినసొంపైన ధ్వని తరంగాలు సవ్వడి చేస్తాయి. ఓ రాయి గుళ్లో గంట కొట్టినట్లు టంగ్.. టంగ్ మని ప్రతిధ్వనిస్తే మరో రాయి ఇనుప రాడ్డుతో గంట కొట్టినట్లు ధ్వనిస్తుంది. రాయి ప్రాధాన్యం తెలిసిన చుట్టుపక్కల ప్రజలు ఆహ్లాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ గుట్టను స్థానికులు నగారా బండగా పిలుస్తున్నారు.

ఇలాంటి రాళ్లను పూర్వీకులు దేవాలయాల నిర్మాణాల్లో ఉపయోగించారు. అలాగే సాయుధ రైతాంగ పోరాట సమయంలో రజాకార్లు గ్రామాలపై దండయాత్ర చేసినపుడు, ఈ ఏనేగుట్టపై మనుషులు కాపాలా ఉండేవారు. రాజుల కాలంలో శత్రువుల కదలికలను గమనించి ఈ బండరాయి వద్ద రాళ్లను రాళ్లతో కొట్టి వచ్చే సప్త స్వరాలతో ప్రజలను అప్రమత్తం చేసేవారంటూ పూర్వీకులు చెప్పేవారని అయిటి పాముల గ్రామస్తులు చెబుతున్నారు.

Musical Rocks Of Enegutta

Musical Rocks Of Enegutta

అందుకే ఈ గుట్టకు నగారా బండగా పేరు వచ్చిందని చెబుతున్నారు. గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల ప్రజలు సెలవుల సమయంలో ఇక్కడికి వచ్చి రాళ్లను మోగిస్తూ నాదస్వరాలను వింటూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అరుదుగా ఉండే ఇలాంటి మ్యూజిక్ రాక్స్ ను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వింత నగర బండను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..